హోమ్ హైదరాబాద్‌ జాతీయం అంతర్జాతీయం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ క్రీడలు ఎడ్యుకేషన్ & కెరీర్‌ బిజినెస్ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ క్రైమ్‌ సంపద వ్యవసాయం సినిమా ఈ-పేపర్
కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తున్న సీనియర్ నేత తాటికొండ జీవన్ రెడ్డి.. రాజకీయాల్లో సంచలనం JH-99080

జనహితం న్యూస్ కరీంనగర్ : కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి కీలక నేతగా ఉన్న తాటికొండ జీవన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. దశాబ్దాలుగా పార్టీకి వెన్నుముకలా ఉన్న ఆయన, తాజా రాజకీయ పరిణామాలపై అసంతృప్తితో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు.

ఈ మేరకు వచ్చే 25న తన పదవితో పాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్లు ఆయన తన అనుచరులకు తెలియజేశారు. పార్టీ తనకు ఇచ్చిన అవకాశాలను గుర్తు చేసుకున్నప్పటికీ, ప్రస్తుతం పరిస్థితులు తనకు అనుకూలంగా లేవని భావించినట్లు సమాచారం.

ఈ పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు మరియు అడ్డూరి లక్ష్మణ్ కుమార్ జీవన్ రెడ్డి నివాసానికి వెళ్లి ఆయనతో చర్చలు జరిపారు. పార్టీని వీడవద్దని, సమస్యలను హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

అయితే ఈ చర్చలు ఫలించలేదు. జీవన్ రెడ్డి తన నిర్ణయంపై వెనక్కి తగ్గకుండా రాజీనామాకు కట్టుబడి ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామం కరీంనగర్ జిల్లా రాజకీయాల్లోనే కాకుండా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో కూడా కలకలం రేపుతోంది.

Click to join Whatsapp channel
Janahitham News
కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తున్న సీనియర్ నేత తాటికొండ జీవన్ రెడ్డి.. రాజకీయాల్లో సంచలనం
కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తున్న సీనియర్ నేత తాటికొండ జీవన్ రెడ్డి.. రాజకీయాల్లో సంచలనం

→ గోనె సాయిలు - ఎడిటర్‌ / సీనియర్ రిపోర్టర్