హోమ్ హైదరాబాద్‌ జాతీయం అంతర్జాతీయం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ క్రీడలు ఎడ్యుకేషన్ & కెరీర్‌ బిజినెస్ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ క్రైమ్‌ సంపద వ్యవసాయం సినిమా ఈ-పేపర్
ఏప్రిల్ 7న ముంబైలో MRPS జాతీయ కార్యవర్గ సమావేశం – హాజరుకావాలని పిలుపు JH-53423

జనహితం న్యూస్ వరంగల్ అర్బన్: ఏప్రిల్ 7న ముంబైలో జరుగు ఎంఆర్పిఎస్ జాతీయ కార్యవర్గ సమావేశానికి హనుమకొండ జిల్లాలోని ప్రతి ఎంఆర్పిఎస్ మరియు అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు రావాలని ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు గద్దల సుకుమార్ మాదిగ పిలుపునిచ్చారు. ఈరోజు ఉదయం నయీమ్ నగర్ లో ఎమ్మార్పీఎస్ హనుమకొండ మండల అధ్యక్షులు బొక్క రాజేష్ మాదిగ అధ్యక్షతన జరిగిన ముఖ్య నాయకుల సమావేశంలో ముఖ్య అతిథిగా ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు గద్దల సుకుమార్ మాదిగ హాజరై మాట్లాడుతూ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి ఆదేశానుసారం ఏప్రిల్ 7న ముంబైలో జాతీయ కమిటీ ఆధ్వర్యంలో జాతీయ కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుందని.

ఆ జాతీయ కమిటీ సమావేశంలో ఎమ్మార్పీఎస్ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ఇంకా వర్గీకరణ అమలు కానీ రాష్ట్రాలలో వర్గీకరణ అమలుకై ఎమ్మార్పీఎస్ పోరాటాన్ని ఉదృతం చేయడం కోసం మరియు ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో దేశంలో దళితులపై జరుగుతున్న దాడుల విషయం మరియు ప్రజా సమస్యల పైన మరియు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో దేశంలో మిగిలి ఉన్న ప్రజా సమస్యల పైన చర్చించడం జరిగి భవిష్యత్ కార్యాచరణ మందకృష్ణ మాదిగ గారు జాతీయ కమిటీ సమావేశంలో ప్రకటిస్తారని తెలియజేశారు. 

ఈ యొక్క జాతీయ కమిటీ సమావేశానికి హనుమకొండ జిల్లాలో ఉన్న అన్ని మండలాల నుండి ఎంఆర్పిఎస్ మరియు అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు ఏప్రిల్ 7న జరుగు జాతీయ కమిటీ సమావేశానికి హాజరై విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. 

ఈ కార్యక్రమంలో సుంచు రజిని కుమార్ మాదిగ ఎమ్మార్పీఎస్ కార్యదర్శి, రేణుకుంట్ల రాజేందర్ మాదిగ ఎమ్మార్పీఎస్ మండల ఉపాధ్యక్షులు, ఎర్ర రాము మాదిగ ఎమ్మార్పీఎస్ మండల నాయకులు, ఎర్ర వరద రాజు మాదిగ ఎమ్మార్పీఎస్ డివిజన్ గౌరవ అధ్యక్షులు, ఇమ్మడి రాజీవ్ మాదిగ ఎమ్మార్పీఎస్ 56 డివిజన్ అధ్యక్షులు, సుంచు కార్తీక్ మాదిగ ఎమ్ ఎస్ ఎఫ్ మండల అధ్యక్షులు, సిలువేరు కిరణ్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.

Click to join Whatsapp channel
Janahitham News
ఏప్రిల్ 7న ముంబైలో MRPS జాతీయ కార్యవర్గ సమావేశం – హాజరుకావాలని పిలుపు
ఏప్రిల్ 7న ముంబైలో MRPS జాతీయ కార్యవర్గ సమావేశం – హాజరుకావాలని పిలుపు

→ గోనె సాయిలు - ఎడిటర్‌ / సీనియర్ రిపోర్టర్