హోమ్ హైదరాబాద్‌ జాతీయం అంతర్జాతీయం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ క్రీడలు ఎడ్యుకేషన్ & కెరీర్‌ బిజినెస్ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ క్రైమ్‌ సంపద వ్యవసాయం సినిమా ఈ-పేపర్
రాజుపోతేపల్లిలో ఘనంగా కోదండరామాలయ విగ్రహ ప్రతిష్ట – పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు JH-63988

జనహితం న్యూస్ ఏలూరు: ఏలూరు జిల్లా టీ. నర్సాపురం మండలం రాజుపోతేపల్లి గ్రామంలో కోదండరామాలయ విగ్రహ ప్రతిష్టా మహోత్సవం బుధవారం అత్యంత వైభవంగా జరిగింది. భక్తిశ్రద్ధల మధ్య జరిగిన ఈ కార్యక్రమంలో పోలవరం మాజీ శాసనసభ్యులు మరియు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ తెల్లం బాలరాజు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు తెల్లం బాలరాజుకు ఘన స్వాగతం పలికారు. ఆలయంలో నిర్వహించిన హోమాలు, పూర్ణాహుతి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.. గ్రామంలో ఆలయ పునఃప్రతిష్ట జరగడం శుభపరిణామమని, ఆ శ్రీరాముని ఆశీస్సులు నియోజకవర్గ ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో బాలరాజుతో పాటు ఏలూరు జిల్లా రైతు విభాగం అధ్యక్షులు వాసిరెడ్డి మధు, స్థానిక మండల నాయకులు, పెద్ద ఎత్తున కార్యకర్తలు మరియు భక్తులు పాల్గొన్నారు. ఆలయ కమిటీ వారు వచ్చిన అతిథులను ఘనంగా సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు. భక్తుల రాకతో రాజుపోతేపల్లి గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం సంతరించుకుంది.

Click to join Whatsapp channel
Janahitham News
రాజుపోతేపల్లిలో ఘనంగా కోదండరామాలయ విగ్రహ ప్రతిష్ట – పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు
రాజుపోతేపల్లిలో ఘనంగా కోదండరామాలయ విగ్రహ ప్రతిష్ట – పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు

→ కొవ్వలి రవితేజ - రిపోర్టర్