స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర వాహనాల ప్రారంభోత్సవంలో పాల్గొన్న కొత్త ప్రకాష్ బాబు
Published on 26 Mar 2026, 02:04 PM 48
JH-88139
జనహితం న్యూస్, T. నర్సాపురం మండలం: ఏలూరు జిల్లా టీ నర్సాపురం మండలం బొర్రంపాలెం గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని సంకల్పంతో స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర వాహనాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం బొర్రంపాలెం గ్రామానికి రెండు వాహనాలను ఇవ్వడం జరిగింది. ఈ వాహనాల ద్వారా బొర్రంపాలెం అభివృద్ధి బాటలో నడిపించాలని గ్రామంలో అక్కడక్కడ పేరుకుపోయిన చెత్తను సేకరించి బొర్రంపాలెం గ్రామం అభివృద్ధికి తోడ్పడవలసిందిగా ప్రజలు కోరుతున్నారు.
ఇకనైనా బొర్రంపాలెం గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించి ఎక్కడా కూడా చెత్త లేకుండా ప్రజలకు ఎటువంటి అనారోగ్యాలు తలెత్తకుండా చూడాలని పంచాయతీ కార్యదర్శి నీ ప్రజలు కోరుచున్నారు. ఈ కార్యక్రమంలో టీ నర్సాపురం మండల మాజీ ఎంపీపీ పెద్దలు వైఎస్ఆర్సిపి నాయకులు కొత్త ప్రకాష్ బాబు శానిటేషన్ సెక్రెటరీ భాస్కర్ మరియు సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.
