పుకార్లను నమ్మవద్దు.. పెట్రోల్ నిల్వలు నిండుగా ఉన్నాయి: SI జయబాబు
Published on 26 Mar 2026, 02:10 PM 52
JH-30106
జనహితం న్యూస్, T. నర్సాపురం మండలం: ఏలూరు జిల్లా టీ నర్సాపురం మండలం లో ఎస్సై జయ బాబు ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో..
జిల్లాలో పెట్రోల్ కొరత ఉందంటూ సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను ప్రజలెవరూ నమ్మవద్దని ఏలూరు జిల్లా T. నర్సాపురం మండల సబ్ ఇన్‌స్పెక్టర్ జయబాబు ఒక ప్రకటనలో కోరారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలకు పలు కీలక సూచనలు చేశారు. మండలంలోని అన్ని పెట్రోల్ బంకుల్లో సరిపడా పెట్రోల్, డీజిల్ నిల్వలు అందుబాటులో ఉన్నాయి. ఎక్కడా కొరత లేదు. కొరత ఏర్పడుతుందనే భయంతో అవసరానికి మించి ఇంధనాన్ని నిల్వ చేసుకోవద్దని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు.
సోషల్ మీడియా వేదికగా అసత్య ప్రచారాలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు.ఎవరైనా అక్రమంగా ఇంధనాన్ని నిల్వ చేసినట్లు తెలిసినా లేదా కృత్రిమ కొరత సృష్టించాలని చూసినా వెంటనే 9440796676, 9550351100 నంబర్‌కు సమాచారం అందించాలని కోరారు. అలాగే ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించి, వాస్తవాలను మాత్రమే ఇతరులకు చేరవేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
