హోమ్ హైదరాబాద్‌ జాతీయం అంతర్జాతీయం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ క్రీడలు ఎడ్యుకేషన్ & కెరీర్‌ బిజినెస్ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ క్రైమ్‌ సంపద వ్యవసాయం సినిమా ఈ-పేపర్
పిజిఆర్‌ఎస్‌ అర్జీలకు నాణ్యమైన పరిష్కారం చూపాలి: జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి JH-26980

జనహితం న్యూస్, ఉంగుటూరు: ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) ద్వారా అందే ప్రతి దరఖాస్తును క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి, నాణ్యమైన పరిష్కారం చూపాలని ఏలూరు జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. సోమవారం ఉంగుటూరు మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన పిజిఆర్‌ఎస్‌ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు పత్సమట్ల ధర్మరాజుతో కలిసి ఆమె పాల్గొన్నారు.

​ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని గుర్తుచేశారు. "అధికారులు విచారణలో అలసత్వం వహించకూడదు. క్షేత్రస్థాయిలో సమస్యను పరిష్కరించి, అర్జీలు మళ్లీ రీ-ఓపెన్ కాకుండా చూడాలి. బాధితులకు సంతృప్తికరమైన సమాధానం అందాలి" అని స్పష్టం చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠిన చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు.

Click to join Whatsapp channel
Janahitham News
పిజిఆర్‌ఎస్‌ అర్జీలకు నాణ్యమైన పరిష్కారం చూపాలి: జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి
పిజిఆర్‌ఎస్‌ అర్జీలకు నాణ్యమైన పరిష్కారం చూపాలి: జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి

→ కొవ్వలి రవితేజ - రిపోర్టర్