హోమ్ హైదరాబాద్‌ జాతీయం అంతర్జాతీయం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ క్రీడలు ఎడ్యుకేషన్ & కెరీర్‌ బిజినెస్ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ క్రైమ్‌ సంపద వ్యవసాయం సినిమా ఈ-పేపర్
ఐటీడీఏలో పి4 వార్షికోత్సవం – ‘స్వర్ణాంధ్ర విజన్ 2047’పై బాలరాజు JH-76390

​జనహితం న్యూస్, కేఆర్ పురం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 2047 నాటికి ప్రపంచస్థాయిలో నిలిపేందుకు కూటమి ప్రభుత్వం 'స్వర్ణాంధ్ర విజన్ 2047 'తో ముందుకు సాగుతోందని పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పేర్కొన్నారు. సోమవారం కేఆర్ పురం ఐటీడీఏ లో నిర్వహించిన పి4 కార్యక్రమ మొదటి వార్షికోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం, ప్రాంగణంలోని స్టాళ్లను సందర్శించి అభివృద్ధి పనుల పురోగతిని సమీక్షించారు.

​పి4 అమలులో విశేష కృషి చేసిన మార్గదర్శకులను, గ్రామ స్థాయి సిబ్బందిని ఎమ్మెల్యే ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలను గుర్తించి త్వరితగతిన పరిష్కరించడంలో పి4 వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తోందని కొనియాడారు. భవిష్యత్తులో మరింత పారదర్శకంగా సేవలు అందించాలని సిబ్బందికి సూచించారు.పేదరిక నిర్మూలన, విద్యా ప్రమాణాల పెంపు, మహిళా సాధికారతే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోంది.

ఐటీడీఏ పరిధిలోని గిరిజనులకు నాణ్యమైన విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా అధికారులు పారదర్శకంగా వ్యవహరించాలి.

​ఈ కార్యక్రమంలో ట్రైకర్ చైర్మన్ బొరగం శ్రీనివాస్, శాప్ డైరెక్టర్ కొవ్వాసు జగదీశ్వరి, ఐటీడీఏ పీవో రాముల నాయక్, గ్రీనరీ అండ్ బ్యూటీఫికేషన్ డైరెక్టర్ పాదం కృష్ణ, బీజేపీ ఎస్టీ మోర్చా నాయకురాలు బొరగం వెంకటలక్ష్మి, పి4 కన్వీనర్ సిహెచ్ శ్రీనివాస్ బాబు, ప్రజాప్రతినిధులు మరియు అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Click to join Whatsapp channel
Janahitham News
ఐటీడీఏలో పి4 వార్షికోత్సవం – ‘స్వర్ణాంధ్ర విజన్ 2047’పై బాలరాజు
ఐటీడీఏలో పి4 వార్షికోత్సవం – ‘స్వర్ణాంధ్ర విజన్ 2047’పై బాలరాజు

→ కొవ్వలి రవితేజ - రిపోర్టర్