గిరిజన రైతులకు సబ్సిడీపై మినీ ట్రాక్టర్లు, చాపల వలల పంపిణీ
Published on 30 Mar 2026, 11:31 PM 30
JH-32853
జనహితం న్యూస్, పోలవరం నియోజకవర్గం: ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గంలో గిరిజన రైతులకు కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు అన్నారు. సోమవారం ఐటీడీఏలో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో లబ్ధిదారులకు సబ్సిడీపై మినీ ట్రాక్టర్ల పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించి, తన చేతుల మీదుగా అందజేశారు.
అనంతరం గిరిజనులకు సబ్సిడీపై చాపల వలలను కూడా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం ద్వారా గిరిజన రైతుల ఆర్థికాభివృద్ధికి తోడ్పాటు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు. వ్యవసాయ రంగంలో ఆధునిక పరికరాల వినియోగం ద్వారా దిగుబడులు పెరుగుతాయని, గిరిజన రైతులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ, గిరిజన ప్రాంతాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని, రైతుల సంక్షేమం కోసం మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ట్రైకర్ చైర్మన్ బొరగం శ్రీనివాస్, షాప్ డైరెక్టర్ కొవ్వాసు జగదీశ్వరి, పీవో రాములు నాయక్, వ్యవసాయ శాఖ ఏడీ బుజ్జిబాబు, అగ్రికల్చర్ ఏవోలు, కూటమి నాయకులు సోంబాబు, గ్రీనరీ అండ్ బ్యూటీఫికేషన్ డైరెక్టర్ పాదం కృష్ణతో పాటు ఇతర కూటమి నాయకులు మరియు అధికారులు పాల్గొన్నారు.
