హోమ్ హైదరాబాద్‌ జాతీయం అంతర్జాతీయం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ క్రీడలు ఎడ్యుకేషన్ & కెరీర్‌ బిజినెస్ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ క్రైమ్‌ సంపద వ్యవసాయం సినిమా ఈ-పేపర్
ప్రజల వద్దకు మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు – పథకాలపై ఆరా JH-66553

జనహితం న్యూస్, పోలవరం నియోజకవర్గం: మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు, గత ఐదు సంవత్సరాల కాలంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'గడప గడపకు మన ప్రభుత్వం' కార్యక్రమం పోలవరం నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగింది. ఈ కార్యక్రమంలో భాగంగా కొయ్యలగూడెం మండలం శ్రీరంగపట్నం గ్రామంలో పోలవరం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, వైయస్సార్ సిపి ఇన్చార్జ్ తెల్లం బాలరాజు పర్యటించారు. ​గ్రామంలోని ప్రతి ఇంటికీ వెళ్లిన బాలరాజు, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు సక్రమంగా అందుతున్నాయా లేదా అని స్వయంగా ఆరా తీశారు. లబ్ధిదారులతో నేరుగా మాట్లాడి, వారికి అందిన లబ్ధిని వివరించారు. అర్హత ఉండి ఏ ఒక్కరికైనా పథకాలు అందకపోతే వెంటనే అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని సూచించారు.

​ఈ సందర్భంగా కొయ్యలగూడెం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ టౌన్ వైస్ ప్రెసిడెంట్ రవి మాట్లాడుతూ.. .ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా తెల్లం బాలరాజు నిరంతరం ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారని కొనియాడారు. సంక్షేమ పథకాలే ఈ ప్రభుత్వానికి శ్రీరామరక్ష అని, ప్రతి గడపకూ మేలు జరిగిందని ఆయన పేర్కొన్నారు.​

ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, వార్డు మెంబర్లు మరియు భారీ సంఖ్యలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజలు తమ సమస్యలను ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకువస్తూ, ప్రభుత్వం చూపిస్తున్న ఆదరణ పట్ల హర్షం వ్యక్తం చేశారు.

Click to join Whatsapp channel
Janahitham News
ప్రజల వద్దకు మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు – పథకాలపై ఆరా
ప్రజల వద్దకు మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు – పథకాలపై ఆరా

→ కొవ్వలి రవితేజ - రిపోర్టర్