హోమ్ హైదరాబాద్‌ జాతీయం అంతర్జాతీయం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ క్రీడలు ఎడ్యుకేషన్ & కెరీర్‌ బిజినెస్ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ క్రైమ్‌ సంపద వ్యవసాయం సినిమా ఈ-పేపర్
పోలవరం జాబ్ మేళా.. 1300కి పైగా ఉద్యోగాలు మీకోసం! JH-65769

జనహితం న్యూస్, పోలవరం నియోజకవర్గం: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో పోలవరం నియోజకవర్గంలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు భారీ జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు పోలవరం శాసనసభ్యులు శ్రీ చిర్రి బాలరాజు తెలిపారు.

జీలుగుమిల్లి మండలం బర్రింకలపాడు గ్రామంలోని పోలవరం ఎమ్మెల్యే పార్టీ కార్యాలయంలో ఈ నెల 17వ తేదీ (శుక్రవారం) జాబ్ మేళా నిర్వహించబడనుంది. ఈ నేపథ్యంలో గురువారం ఎమ్మెల్యే కార్యాలయంలో జాబ్ మేళా కరపత్రాన్ని ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఆవిష్కరించారు.

ఈ జాబ్ మేళాలో 16కి పైగా ప్రముఖ కంపెనీల ప్రతినిధులు పాల్గొని, సుమారు 1315 మందికి పైగా నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. పదో తరగతి నుండి పీజీ, బీటెక్, ఐటీఐ, ఫార్మసీ తదితర అర్హతలు కలిగిన 18 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు గల అభ్యర్థులు ఈ మేళాకు అర్హులని పేర్కొన్నారు.

నియోజకవర్గంలోని యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. జాబ్ మేళాకు హాజరయ్యే అభ్యర్థులు తమ బయోడేటా మరియు అవసరమైన సర్టిఫికెట్ల జిరాక్స్ ప్రతులతో రావాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా నైపుణ్యాభివృద్ధి ప్లేస్మెంట్ అధికారి కె. ప్రవీణ్, కూటమి నాయకులు దుగ్గిన శ్రీనివాస్, తమ్మన సాంబశివరావు, కక్కిరాల శ్రీను తదితరులు పాల్గొన్నారు.

ఇతర వివరాలకు:

9652503799, 9666322032

(కమాండ్ కంట్రోల్ నంబర్లు: 9988853335, 8712655686, 8790118349, 8790117279)

Click to join Whatsapp channel
Janahitham News
పోలవరం జాబ్ మేళా.. 1300కి పైగా ఉద్యోగాలు మీకోసం!
పోలవరం జాబ్ మేళా.. 1300కి పైగా ఉద్యోగాలు మీకోసం!

→ కొవ్వలి రవితేజ - రిపోర్టర్