రాష్ట్ర వైఎస్ఆర్సిపి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు ఏబీఎన్ రాధాకృష్ణ మహిళలకు క్షమాపణ చెప్పాలి
Published on 09 Apr 2026, 01:34 PM 92
JH-76326
జనహితం న్యూస్, పోలవరం: ఏలూరు జిల్లా, పోలవరం మండలం, పోలవరం, YSRCP పార్టీ అధ్యక్షులు మరియు పోలవరం మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు గారు ఆదేశాలుతో, రాష్ట్ర మహిళల పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఏబీఎన్ ఛానల్ రాధాకృష్ణ రాష్ట్ర మహిళలందరికీ బహిరంగ క్షమాపణ చెప్పిన వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలతో కలిసి పోలవరం పోలీస్ స్టేషన్ వద్ద కంప్లైంట్ ఇవడం జరిగింది.
ఖబడ్దార్ రాధాకృష్ణ.. ఆడవాళ్ల జోలికొస్తే నాలుకలు తెగ్గోస్తాం!
భార్యను చెల్లిగా అభివర్ణించిన ఏబీఎన్ రాధాకృష్ణ పై ఆగ్రహం రాష్ట్ర మహిళా లోకానికి రాధాకృష్ణ తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో దళిత మహిళలకు రక్షణ లేదన్నారు. ఎల్లో మీడియ పిచ్చి రాతలు రాస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు బుగ్గ మురళి కృష్ణ, MPP సుంకర వెంకటరెడ్డి గారు, మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
