హోమ్ హైదరాబాద్‌ జాతీయం అంతర్జాతీయం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ క్రీడలు ఎడ్యుకేషన్ & కెరీర్‌ బిజినెస్ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ క్రైమ్‌ సంపద వ్యవసాయం సినిమా ఈ-పేపర్
శీలం వెంకటేశ్వరరావు చేతుల మీదుగా SSV మెగా టోర్నమెంట్ ప్రారంభం JH-80546

జనహితం న్యూస్, టీ నర్సాపురం: ఏలూరు జిల్లా టీ నర్సాపురం మండలం వెలగపాడు పంచాయతీ పరిధిలోని వీరభద్రవరం గ్రామంలో ఎస్‌ఎస్‌వీ మెగా టోర్నమెంట్ ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జగ్గంపేట నియోజకవర్గ పరిశీలకులు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు శీలం వెంకటేశ్వరరావు హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత అందరూ ఈ టోర్నమెంట్‌లో ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించాలని సూచించారు. ముఖ్యంగా యువత చెడు మార్గాలకు దూరంగా ఉండి, ఉన్నత లక్ష్యాలను సాధించే దిశగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

మల్లు కుంట సొసైటీ చైర్మన్ శీలం సాయి వినయ్ కుమార్ మాట్లాడుతూ, యువతలో క్రీడాస్ఫూర్తి పెంపొందించేందుకు ఈ టోర్నమెంట్ మంచి వేదికగా నిలుస్తుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, ప్రైజ్ మనీతో పాటు బహుమతులు గెలుచుకోవాలని ఆకాంక్షించారు. అలాగే తల్లిదండ్రులను గౌరవిస్తూ, మంచి మార్గంలో ముందుకు సాగాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో టీ నర్సాపురం మండలం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కాల్నిడి రాంబాబు, కాల్నిడి వెంకటేశ్వరరావు, తెలుగు యువత మండల అధ్యక్షులు కాల్నిడి వాసు, వెలగపాడు మాజీ సర్పంచ్ నైనారపు జలపాలు, జోను బోయిన వెంకటేశ్వరరావు (భాష), పోలవరం నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షులు గండబోయిన నాగేంద్రబాబు (శ్రీను), తెలుగు యువత ఆర్గనైజర్ సెక్రటరీ ఎర్ర గొర్ల సుబ్బారావు, జంగాల సత్తిబాబు, భరత్ తదితరులు పాల్గొన్నారు.

Click to join Whatsapp channel
Janahitham News
శీలం వెంకటేశ్వరరావు చేతుల మీదుగా SSV మెగా టోర్నమెంట్ ప్రారంభం
శీలం వెంకటేశ్వరరావు చేతుల మీదుగా SSV మెగా టోర్నమెంట్ ప్రారంభం

→ కొవ్వలి రవితేజ - రిపోర్టర్