హోమ్ హైదరాబాద్‌ జాతీయం అంతర్జాతీయం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ క్రీడలు ఎడ్యుకేషన్ & కెరీర్‌ బిజినెస్ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ క్రైమ్‌ సంపద వ్యవసాయం సినిమా ఈ-పేపర్
లష్కర్‌లకు వేతనాలు ఎప్పుడు?.. విజయసాగర్ ప్రాజెక్టుపై వినతి JH-11433

జనహితం న్యూస్, టీ నర్సాపురం: ఏలూరు జిల్లా టీ నర్సాపురం మండల తహశీల్దార్ తోట సాయిబాబా గారికి, యం పి డి ఓ జి మణికుమారి లకు వినతి పత్రాలు అందజేసిన టి నరసాపురం సాగునీటి సంఘం అధ్యక్షులు కొనకళ్ళ మోహన్ కుమార్, నందమూరి విజయసాగర్ ప్రాజెక్టు మ్యాన్ మజ్దూర్ (లష్కర్) వేతనాల చెల్లింపు, క్రమబద్దీకరణ సమస్యలు పరిష్కరించాలనీ కోరుతూ  టి నరసాపురం సాగు నీటి సంఘం అధ్యక్షులు కొనకళ్ళ మోహన్ ప్రభుత్వాన్ని కోరారు, ఈ మేరకు బుధవారం నాడు టి నర్సాపురం తహశీల్దార్ తోట సాయిబాబా గారికి, యం పి డి ఓ జి మణికుమారి లకు వినతి పత్రాలు అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు టి నరసాపురం ప్రాంతంలో సాగునీటి ప్రాజెక్టుగా నందమూరి విజయసాగర్ ప్రత్యేకత తమరికి ప్రభుత్వానికి తెలిసిందని ఈ ప్రాజెక్టు నుండి సాగుకు నీటి విడుదల, చెరువుకు సంబంధించి చిన్నపాటి మరమ్మతులు, ఇతర సమాచారాలకు సంబంధించి అన్ని విధాలుగా సహకరిస్తున్న మ్యాన్ మజ్దూర్ (లష్కర్) గా గత పన్నెండు సంవత్సరాలుగా ధన్ గాంధీలాల్ అంకితభావంతో నిజాయితీగా పనిచేస్తున్నాడనీ అంశాన్ని సాగునీటి చైర్మన్ గా తను ధ్రువీకరిస్తున్నానన్నారు.

గత మూడున్నర సంవత్సరాలుగా ప్రభుత్వం నుండి ఎలాంటి వేతనాలు చెల్లింపు జరగటం లేదన్నారు. దీంతో వారి కుటుంబం ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారన్నారు, అయినా కూడా వృత్తి పట్ల నిబద్ధతతో పనిచేస్తున్నాడన్నారు, కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నీటి భద్రత వంద రోజుల కార్యక్రమంలో కూడా ఇతని పాత్ర గణనీయం అని ప్రశంసించారు. ప్రభుత్వం స్పందించి మ్యాన్ మజ్దూర్లకు వేతనాల చెల్లింపు తో పాటు క్రమబద్ధీకరణ అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలని సంబంధిత ఉన్నతాధికారులు  ఈ అంశాన్ని ప్రభుత్వానికి సిఫారసు చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్తలు ఎస్.డి. నాసర్ పాషా, కొరివి నాగేశ్వరరావు, లష్కర్ (మ్యాన్ మజ్దూర్) డన్ గాంధీలాల్ తదితరులు పాల్గొన్నారు.

Click to join Whatsapp channel
Janahitham News
లష్కర్‌లకు వేతనాలు ఎప్పుడు?.. విజయసాగర్ ప్రాజెక్టుపై వినతి
లష్కర్‌లకు వేతనాలు ఎప్పుడు?.. విజయసాగర్ ప్రాజెక్టుపై వినతి

→ కొవ్వలి రవితేజ - రిపోర్టర్