హోమ్ హైదరాబాద్‌ జాతీయం అంతర్జాతీయం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ క్రీడలు ఎడ్యుకేషన్ & కెరీర్‌ బిజినెస్ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ క్రైమ్‌ సంపద వ్యవసాయం సినిమా ఈ-పేపర్
అంబరాన్ని అంటిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135 వ జన్మదిన వేడుకలు JH-73994

జనహితం న్యూస్, టీ నర్సాపురం: ఏలూరు జిల్లా టీ నర్సాపురం మండలం బొర్రంపాలెం గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా టీ నర్సాపురం మండలం తాసిల్దార్ సత్య సాయి బాబా మరియు టీ నర్సాపురం సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ జయ బాబు అలాగే ఒక మారుమూల ప్రాంతంలో పుట్టి అంచలంచలుగా పైకెదికి యువత అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్న ప్రముఖ వ్యాపారవేత్త బొమ్మ గాని బాలకృష్ణ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

వీరు మాట్లాడుతూ యువత అందరూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయాలను ఆలోచనలను ముందుకు తీసుకువెళ్లాలి ఈ విషయంలో ప్రతి ఒక్కరూ ముందుండి ఆయన ఆశయాలను ఆలోచన విధానాలను ముందుకు తీసుకువెళ్లి యువత అందరూ కూడా చెడు మార్గాలను ఎంచుకోకుండా ప్రతి ఒక్కరు చెడు వ్యసనాలను దూరం పెట్టి వారు సాధించాలనుకునే లక్ష్యాల మీద దృష్టి పెట్టి వారి తల్లిదండ్రులకు గొప్ప పేరు ప్రతిష్టలు తీసుకొచ్చే విధంగా యువత అందరూ ముందుండాలని వారు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మారుమూడి నాగార్జున వారి ఆర్థిక సహాయంతో 20 మందికి ఎలిమెంట్లు వీరి చేతుల మీదగా పంపిణీ చేయడం జరిగింది. అలాగే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి రోజునే చలివేంద్రం ఏర్పాటు చేయడం ఎంతో శుభ సూచకమని ప్రజలు ఆనంద వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సంఘ సభ్యులు మరియు యూత్ కలపర్తి విజయ్, గుండె గణపతి, బోనాల తంబి, గుండె మాణిక్యాలరావు, నల్లమిల్లి శ్రీను, కనికెళ్ళ వెంకటేశ్వరరావు, కొండ్రు సంజయ్ మరియు అంబేద్కర్ యూత్ ఈ వేడుకల్లో పాల్గొనడం జరిగింది

Click to join Whatsapp channel
Janahitham News
అంబరాన్ని అంటిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135 వ జన్మదిన వేడుకలు
అంబరాన్ని అంటిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135 వ జన్మదిన వేడుకలు

→ కొవ్వలి రవితేజ - రిపోర్టర్