హోమ్ హైదరాబాద్‌ జాతీయం అంతర్జాతీయం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ క్రీడలు ఎడ్యుకేషన్ & కెరీర్‌ బిజినెస్ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ క్రైమ్‌ సంపద వ్యవసాయం సినిమా ఈ-పేపర్
జీలుగుమిల్లిలో అంబేద్కర్ జయంతి వైభవం… ఎమ్మెల్యే బాలరాజు ఘన నివాళి JH-53068

జనహితం న్యూస్, ఏలూరు: ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండల కేంద్రంలో అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ శిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. అంబేద్కర్ చిత్రపటాలు, జెండాలతో అలంకరించి వేడుకలను ప్రత్యేకంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పోలవరం శాసనసభ్యులు శ్రీ చిర్రి బాలరాజు హాజరై అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు సమర్పించి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని అంబేద్కర్ ఆశయాలను స్మరించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, డాక్టర్ అంబేద్కర్ గారు భారత దేశానికి అందించిన రాజ్యాంగం ప్రపంచంలోనే గొప్పదిగా నిలిచిందని తెలిపారు. సమాజంలో వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన చేసిన కృషి అపారమని, ప్రతి ఒక్కరూ ఆయన చూపిన మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు. విద్య, సమానత్వం, సామాజిక న్యాయం వంటి విలువలు ప్రతి ఒక్కరి జీవితంలో ప్రతిఫలించాలన్నారు. యువత అంబేద్కర్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని సమాజ అభివృద్ధికి ముందుండాలని సూచించారు.

అలాగే ప్రభుత్వం పేదల సంక్షేమం, విద్యాభివృద్ధి, ఉపాధి అవకాశాల పెంపు వంటి అంశాలపై కట్టుబడి పనిచేస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేసి ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే లక్ష్యమని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జీలుగుమిల్లి మండల అధ్యక్షులు పసుపులేటి రాము, పాలోజి దుర్గ ప్రసాద్, నారగాని నరేంద్ర, చామన శేఖర్, అంబేద్కర్ యూత్ అధ్యక్షుడు దారా మనోజ్ కుమార్, బొంతు వెంకటేశ్వరరావు, బొంతు రామకృష్ణ, యూత్ సభ్యులు చాబత్తుల అరుణ్ కుమార్, మర్రి రాజేష్, గెడ్డం జనార్దన్, నరసింహ, మాధవ, తలారి సతీష్, సిరిశెట్టి వెంకటేశ్వరరావు, తదితర ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, గ్రామస్థులు మరియు యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Click to join Whatsapp channel
Janahitham News
జీలుగుమిల్లిలో అంబేద్కర్ జయంతి వైభవం… ఎమ్మెల్యే బాలరాజు ఘన నివాళి
జీలుగుమిల్లిలో అంబేద్కర్ జయంతి వైభవం… ఎమ్మెల్యే బాలరాజు ఘన నివాళి

→ కొవ్వలి రవితేజ - రిపోర్టర్