హోమ్ హైదరాబాద్‌ జాతీయం అంతర్జాతీయం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ క్రీడలు ఎడ్యుకేషన్ & కెరీర్‌ బిజినెస్ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ క్రైమ్‌ సంపద వ్యవసాయం సినిమా ఈ-పేపర్
ఘనంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జన్మదిన వేడుకలు JH-49234

జనహితం న్యూస్, టీ నర్సాపురం: ఏలూరు జిల్లా టీ నర్సాపురం మండలం వెలగపాడు గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జన్మదిన వేడుకలు అంబరాన్ని అంటే ఎలా సంబరాలు చేశారు. 

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు జగ్గంపేట నియోజకవర్గ పరిశీలకులు శీలం వెంకటేశ్వరరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భారతదేశానికి అందించిన రాజ్యాంగం ప్రపంచంలోని గొప్పదిగా నిలిచిందని తెలియజేశారు.

సమాజంలో వెనకబడిన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన చేసిన కృషి అపారమని. ప్రతి ఒక్కరు ఆయన చూపిన మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు. విద్య, సమానత్వం, సామాజిక న్యాయం, వంటి విలువలు ప్రతి ఒక్కరి జీవితంలో ప్రతి ఫలించాలన్నారు యువత అంబేద్కర్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని సమాజాభివృద్ధికి ముందుండాలని ఆయన సూచించారు. 

మల్లు కుంట సొసైటీ చైర్మన్ శీలం సాయి వినయ్ కుమార్ మాట్లాడుతూ యువత అందరూ అంబేద్కర్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు కొనసాగాలని సూచించారు యువత అందరూ కూడా చెడు వ్యసనాలు అలవాటు చేసుకోకుండా ప్రతి ఒక్కరు కూడా మంచి మార్గంలో ఆయన ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలని పేర్కొన్నారు. 

ఈ కార్యక్రమంలో వెలగపాడు మాజీ సర్పంచ్ నైనారపు జలపాలు టీ నర్సాపురం మండలం తెలుగు యువత ఆర్గనైజర్ సెక్రెటరీ ఎర్ర గొర్ల సుబ్బారావు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సంఘ సభ్యులు భరత్ మరియు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు

Click to join Whatsapp channel
Janahitham News
ఘనంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జన్మదిన వేడుకలు
ఘనంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జన్మదిన వేడుకలు

→ కొవ్వలి రవితేజ - రిపోర్టర్