అప్పలరాజుగూడెం రోడ్డు-వంతెన కోసం పోరాటం… రైతు సంఘాల డిమాండ్
Published on 14 Apr 2026, 06:04 PM 80
JH-15271
జనహితం న్యూస్, టీ నర్సాపురం: మండలంలో అప్పలరాజు గూడెం నుండి మధ్యాహ్నపు వారి గూడెం వరకు ఆరు కిలోమీటర్లు రోడ్డు వంతెన నిర్మాణానికై అధికారులు ప్రజాప్రతినిధులు తక్షణమే చర్యలు తీసుకోవాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు గూడెల్లి వెంకట్రావు పత్రికల ఉద్దేశించి అన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ 13 సంవత్సరాల క్రితం నాటి నాయకులు వెళ్లిన వెంకటరత్నం సర్పంచ్ ఆధ్వర్యంలో రెండు కోట్ల యాభై లక్షలు రూపాయలు నిధులు మంజూరు నాటి మినిస్టర్ సాంబశివరావు నిధులు ఇచ్చినప్పటికీ తర్వాత ప్రభుత్వంలో వంతెన నిర్మాణం కాకుండా పక్కదారి పట్టించారని అప్పలరాజు గూడెం రోడ్డు నిర్మాణం చేసి రోడ్డు పోస్తే రైతాం గానికి రవాణా మార్గం సులభం అవుతుందని సుమారు 50 55 కిలోమీటర్ల దూరం తగ్గిపోతుందని తాంగానికి ప్రయాణానికి అతి సులువైన మార్గాన్ని విస్మరించటాన్ని విమర్శించారు.
తక్షణమే అప్పలరాజు గూడెం నుంచి మధ్యాహ్న పారిగూడెం వెళ్లే రోడ్డు నిర్మాణం చేపట్టి అప్పలరాజు గూడెం కాలవపై వంతెన నిర్మించాలని తద్వారా ప్రమాదాలను నివారించాలని విజ్ఞప్తి చేశారు రోడ్డు వంతెన సాధనకై ఈనెల 18వ తారీఖున అప్పలరాజు గూడెం నుండి మధ్యాహ్నపు వారు గూడెం పాదయాత్ర వార్పు కార్యక్రమాన్ని అప్పలరాజు గూడెం మధ్యాహ్నపు వారి గూడెం తిరుమల దేవి పేట సదురు గ్రామాల రైతాంగం ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయాలని ఈ సందర్భంగా కోరారు.
