గన్నిన సూర్యచంద్రరావు చిత్రపటానికి ఘన నివాళి
Published on 28 Mar 2026, 07:57 PM 61
JH-66165
జనహితం న్యూస్, బుట్టాయిగూడెం: రెడ్డి గణపవరం సొసైటీ చైర్మన్ గన్నిన సూర్యచంద్రరావు ఇటీవల మృతి చెందడం పట్ల పలువురు ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు గన్నిన సురేంద్రనాథ్ చౌదరి బాబాయ్ అయిన సూర్యచంద్రరావు చిత్రపటానికి శనివారం వారి నివాసంలో ఘనంగా నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కాల్నిటి రాంబాబు పాల్గొని, సూర్యచంద్రరావుతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆయన మృతి పార్టీకి, ఆ ప్రాంతానికి తీరని లోటని పేర్కొన్నారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
ఈ నివాళులర్పించిన వారిలో ఏపుకుంట పంచాయతీ టీడీపీ అధ్యక్షులు సాదనాల భూసిబాబు, పసుమర్తి భీమేశ్వరరావు, రామ్ కుమార్ మరియు ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
