హోమ్ హైదరాబాద్‌ జాతీయం అంతర్జాతీయం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ క్రీడలు ఎడ్యుకేషన్ & కెరీర్‌ బిజినెస్ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ క్రైమ్‌ సంపద వ్యవసాయం సినిమా ఈ-పేపర్
భక్తిశ్రద్ధలతో గుడ్ ఫ్రైడే వేడుకలు : సిలువ మార్గంలో పాల్గొన్న ఎంపీపీ గంజిమాల రామారావు JH-42468

జనహితం న్యూస్, కొయ్యలగూడెం: ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం కొయ్యలగూడెం మండల కేంద్రంలో గుడ్ ఫ్రైడే వేడుకలు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించబడ్డాయి. లోక రక్షకుడైన యేసుక్రీస్తు ప్రాణత్యాగాన్ని స్మరిస్తూ క్రైస్తవ సోదరులు నిర్వహించిన ‘సిలువ మార్గం’ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కొయ్యలగూడెం మండల పరిషత్ అధ్యక్షులు (ఎంపీపీ) గంజిమాల రామారావు పాల్గొని సిలువ యాత్రను ఉద్దేశించి మాట్లాడారు. ఆయనతో పాటు ఎస్సీ సెల్ నాయకులు బొబ్బర సుబ్బారావు, బొబ్బర అంబేద్కర్, మరియు నూతంగి జయప్రకాష్ (మున్నా) తదితరులు పాల్గొన్నారు.

ప్రార్థనల్లో మునిగిన విశ్వాసులు కొయ్యలగూడెం మండలంలోని వివిధ ఆర్.సి.యం చర్చీలకు చెందిన ఫాదర్స్, పాస్టర్లు మరియు పెద్ద సంఖ్యలో సంఘస్తులు ఈ సిలువ మార్గంలో భాగస్వాములయ్యారు. క్రీస్తు పడిన శ్రమలను స్మరిస్తూ పట్టణ పురవీధుల గుండా సాగిన ఈ యాత్రలో భక్తులు భక్తిగీతాలు ఆలపిస్తూ ప్రార్థనలు చేశారు. మరియు కొయ్యలగూడెం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ టౌన్ వైస్ ప్రెసిడెంట్ పూలపల్లి రవికుమార్ పాల్గొన్నారు

Click to join Whatsapp channel
Janahitham News
భక్తిశ్రద్ధలతో గుడ్ ఫ్రైడే వేడుకలు : సిలువ మార్గంలో పాల్గొన్న ఎంపీపీ గంజిమాల రామారావు
భక్తిశ్రద్ధలతో గుడ్ ఫ్రైడే వేడుకలు : సిలువ మార్గంలో పాల్గొన్న ఎంపీపీ గంజిమాల రామారావు

→ కొవ్వలి రవితేజ - రిపోర్టర్