ఎలక్ట్రానిక్ మీడియా కోశాధికారిగా దాసు నియామకం – ఎమ్మెల్యే చంటి సమక్షంలో ప్రకటన
Published on 31 Mar 2026, 02:26 AM 11
JH-86321
జనహితం న్యూస్, ఏలూరు జిల్లా: ఏలూరు జిల్లా స్థానిక ఎమ్మెల్యే బడేటి చంటి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ బ్రాడ్ కాస్ట్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ జిల్లా నూతన కార్యవర్గ ప్రకటన జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా కోశాధికారిగా దాసుని నియమించారు.
ఈ నియామక కార్యక్రమం అనంతరం ప్రముఖ జర్నలిస్టు మరియు మీడియా ప్రతినిధి ఎల్లే రవీంద్ర మాట్లాడుతూ, జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి పనిచేసే వ్యక్తులకు పదవులు దక్కడం శుభపరిణామమని పేర్కొన్నారు. తనతో పాటు మీడియా మిత్రులు రమేష్, జిల్లా అక్రిడిటేషన్ కమిటీ సభ్యులు కళ్యాణ్, సత్యనారాయణ,శంకరావు తదితరులు కలిసి నూతన కోశాధికారి దాసుకి ఘనంగా అభినందనలు తెలియజేశారు.
ఈ సందర్భంగా కోశాధికారి దాసు మాట్లాడుతూ తన నియామకానికి సహకరించిన ఎమ్మెల్యే బడేటి చంటికి, ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర నాయకులు అంజనేయులు, జిల్లా అధ్యక్షులు జబీర్, మరియు తన వెన్నంటే ఉండి ప్రోత్సహించిన మీడియా మిత్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
జర్నలిస్టుల ఐక్యత కోసం, అసోసియేషన్ బలోపేతం కోసం మీడియా మిత్రుల సహకారంతో ముందుకెళ్తానని ఆయన ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేశారు.
