టీ నర్సాపురం పంచాయతీ సరిహద్దు ఉడతల మెట్ట పుంత అభివృద్ధికి చర్యలు చేపట్టాలి
Published on 02 Apr 2026, 03:48 PM 37
JH-54742
జనహితం న్యూస్, టి నరసాపురం: ఏలూరు జిల్లా టి నర్సాపురం మండలం తహశీల్దార్ తోట సాయిబాబా గారికి, ఎంపీడీవో కార్యాలయంలో వినతి పత్రాలు అందజేసిన గ్రామస్తులు. టీ నర్సాపురం, ఏపీ గుంట పంచాయతీల సరిహద్దు ఉడతల మెట్ట పుంతను రైతుల మరియు ప్రజల అవసరాల కొరకు గ్రావెల్ రోడ్డు గా అభివృద్ధి చేయాలని దీనికై నిధులు మంజూరు చేయాలని గండిగూడెం మరియు గురువాయి గూడెం గ్రామస్తులు గురువారం నాడు టీ నర్సాపురం మండల తహశీల్దార్ తోట సాయిబాబా గారికి, ఎంపీడీవో కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ శేఖర్ గారికి సామూహిక సంతకాలతో కూడిన వినతి పత్రాలు అందజేశారు.
ఈ సందర్భంగా సామాజిక కార్యకర్త యస్ డి నా సర్ పాషా మాట్లాడుతూ రైతుల వ్యవసాయ ఉత్పత్తుల రవాణాకు, ప్రజా రవాణాకు ఉపయోగించుకునే ఉడతల మెట్ట పుంత రోడ్డు అనగా ఏపీ గుంట మరియు టి నరసాపురం పంచాయతీ సరిహద్దు పుంత గండిగూడెం సరిహద్దులో ఉంటుందనీ ఈ పుంత రోడ్డును పక్కా గ్రావెల్ రోడ్డు గా అభివృద్ధి చేయుటకు ప్రభుత్వానికి పి జి ఆర్ ఎస్ ద్వారా అభ్యర్థనలు చేసి ఉన్నా మనీ జిల్లా అధికారుల నుండి సానుకూల స్పందనతో పాటు ఆ మేరకు పురోగతి ఉందని దీనికై రెవెన్యూ అధికారుల ఆధ్వర్యంలో పేరుబోయిన యేసు పొలం నుండి దాకారపు పల్లారావు తోట వరకు తీర్మానంలో ఉన్న ఈ రెండున్నర కిలోమీటర్ల ప్రతిపాదిత గ్రావెల్ రోడ్డు నిర్మాణానికి గ్రామ సభ తీర్మానం మేరకు సర్వే నిర్వహించి హద్దులు చూపించాలని, ప్రతిపాదిత గ్రావెల్ రోడ్డు నిర్మాణ సాంకేతిక అంచనా వ్యయం నిధుల మంజూరుకు మండల ప్రజా పరిషత్ అధికారులు, ప్రజా ప్రతినిధులు సంబంధిత ప్రతిపాదనలు ఆమోదించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్త పింగుల మధు, గండిగూడెం గ్రామస్తులు కాకాని వెంకటేశ్వరరావు, పింగుల పుల్లయ్య, ఎర్ర గొల్ల సురేష్, నాగ వెంకటేశ్వరరావు,తనగాల వీరయ్య, ఎర్ర గొర్ల రమేష్, ఎం రాజు, కోట వెంకటేశ్వరరావు ,దుగ్గిరాల పుల్లారావు, పేరు బోయిన సత్యనారాయణ ,పేరుబోయిన పేరయ్య, పేరుకుపోయిన ధర్మయ్య , మంగళగిరి సుహాల్, రాములమ్మ, డోలా వెంకటేశ్వరరావు, పేరు పోయిన బుజ్జి తదితరులు పాల్గొన్నారు.
