వైయస్సార్సీపి సీనియర్ కార్యకర్తను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు
Published on 13 Apr 2026, 09:33 PM 121
JH-70007
జనహితం న్యూస్, ఏలూరు: ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం రౌతుగూడెం గ్రామంలో వైఎస్ఆర్సిపి సీనియర్ కార్యకర్త కొప్పుల గురుమూర్తి గారు కాలు విరగడంతో వారి నివాసానికి వెళ్లి పరామర్శించిన పోలవరం మాజీ శాసనసభ్యులు తెల్లం బాలరాజు గారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పార్టీ కార్యకర్తలు ఎల్లప్పుడూ మన కుటుంబ సభ్యులే అని, వారికి ఏవైనా అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు అండగా నిలబడటం మన బాధ్యత అని తెలిపారు. గురుమూర్తి గారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ధైర్యం చెప్పారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ రాముడు, షేక్ అమిర్ వల్లి, గంగిరెడ్ల సత్యనారాయణ, నల్లపు శ్రీనివాస్, వేముల వెంకటేశ్వరరావు, కొప్పుల మహేష్, మొహమాటం మంగరాజు, గోపిని రాము తదితరులు పాల్గొన్నారు.
