మే 5కి Telangana 10th Results వస్తాయా..? విద్యార్థులకు కీలక అప్డేట్
Published on 18 Apr 2026, 12:38 PM 78
JH-42146
జనహితం న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో 10వ తరగతి పరీక్షలు ఏప్రిల్ 16తో పూర్తయ్యాయి. అప్పటి నుంచి విద్యార్థులందరి దృష్టి ఫలితాలపైనే ఉంది. ఎప్పుడొస్తాయా అన్న ఆత్రుత రోజురోజుకీ పెరుగుతోంది.
ఇప్పటికే పేపర్ల కరెక్షన్ పనులు మొదలయ్యాయి. టీచర్లు బిజీగా పని చేస్తున్నారు. ఈ కరెక్షన్‌ను ఏప్రిల్ 22కి పూర్తిచేయాలని చూస్తున్నట్లు సమాచారం. ఆ తర్వాత మరోసారి చెక్ చేసే అవకాశం ఉండటంతో, ఇంకొన్ని రోజులు పడే ఛాన్స్ ఉంది.
ఈ లెక్కన చూస్తే, మే 5కి ఫలితాలు వచ్చే అవకాశం ఉందని వినిపిస్తోంది. కానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
ఫలితాలు వచ్చిన తర్వాత విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు:
👉 bse.telangana.gov.in
పరీక్షలు అయిపోయాక కొంచెం రిలీఫ్ ఉన్నా… ఇప్పుడు అసలు టెన్షన్ మొదలైంది. “ఎలా రాశాం… ఎలాంటి మార్కులు వస్తాయో…” అన్న టెన్షన్‌తో చాలామంది విద్యార్థులు ఎదురుచూస్తున్నారు.
