ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలిపిన శీలం వెంకటేశ్వరరావు
Published on 19 Mar 2026, 08:25 PM 21
JH-59450
జనహితం న్యూస్ , టీ నర్సాపురం,మార్చి:19 పరాభవ నామ సంవత్సర ఉగాది పండుగను పురస్కరించుకుని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి, జగ్గంపేట పరిశీలకులు మరియు మాజీ జడ్పీటీసీ ఎంపీపీ శీలం వెంకటేశ్వరరావు ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలతో పాటు, ప్రత్యేకంగా పోలవరం నియోజకవర్గం,ఏలూరు జిల్లా, టి. నర్సాపురం మండలం, వెలగపాడు పంచాయతీ మరియు వీరభద్రవరం గ్రామ ప్రజలకు ఆయన పేరుపేరునా శుభాకాంక్షలు అందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, "ఈ ఉగాది ప్రతి ఇంట్లో ఆనందం, ఆరోగ్యం, మరియు ఐశ్వర్యాన్ని నింపాలని, ప్రతి ఒక్కరూ విజయ పథంలో సాగాలని కోరుకుంటున్నాను. ఉగాది పచ్చడిలోని షడ్రుచుల వలె మీ జీవితంలో కష్టసుఖాలు సమానంగా ఉంటూ, అందరూ సుఖసంతోషాలతో వర్ధిల్లాలి" అని ఆకాంక్షించారు.
