హోమ్ హైదరాబాద్‌ జాతీయం అంతర్జాతీయం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ క్రీడలు ఎడ్యుకేషన్ & కెరీర్‌ బిజినెస్ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ క్రైమ్‌ సంపద వ్యవసాయం సినిమా ఈ-పేపర్
జాబ్ క్యాలెండర్ విడుదలపై తెలుగు యువత హర్షం వ్యక్తo JH-92517

జనహితం న్యూస్ టీ నర్సాపురం: కూటమి ప్రభుత్వం 10,060 పోస్టులతో మెగా జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం పట్ల ఏలూరు జిల్లా టి.నరసాపురం మండల తెలుగు యువత అధ్యక్షులు కాల్నేడి శ్రీనివాస్ (వాసు) హర్షం వ్యక్తం చేశారు. నిరుద్యోగుల చిరకాల స్వప్నాన్ని నెరవేరుస్తూ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం అభినందనీయమని ఆయన కొనియాడారు. ఏళ్ల తరబడి నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఈరోజు నిజమైన ఉగాది పండుగని శ్రీనివాస్ పేర్కొన్నారు. యువగళం పాదయాత్రలో మంత్రి నారా లోకేష్ ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నారని, యువత సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందనడానికి ఇదే నిదర్శనమని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా యువత సిద్ధం కావాలని, తమ కలలను సాకారం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

Click to join Whatsapp channel
Janahitham News
జాబ్ క్యాలెండర్ విడుదలపై తెలుగు యువత హర్షం వ్యక్తo
జాబ్ క్యాలెండర్ విడుదలపై తెలుగు యువత హర్షం వ్యక్తo

→ కొవ్వలి రవితేజ - రిపోర్టర్