జంగారెడ్డిగూడెం Raja Hospital లో ఆధునిక వైద్య సేవలపై అవగాహన: డాక్టర్ రాజేష్ రెడ్డి ముప్పన
Published on 20 Mar 2026, 11:14 AM 43
JH-52598
జనహితం న్యూస్ జంగారెడ్డిగూడెం: జంగారెడ్డిగూడెంలోని ప్రముఖ ప్రయివేట్ వైద్యశాల Raja Hospital నందు ప్రముఖ లాపరోస్కోపిక్ సర్జన్ డాక్టర్ రాజేష్ రెడ్డి ముప్పన వైద్య రంగంలో వస్తున్న ఆధునిక మార్పులపై ప్రత్యేకంగా మాట్లాడారు. ఒకప్పుడు పెద్ద నగరాలకే పరిమితమైన లాపరోస్కోపిక్ (కీహోల్) శస్త్రచికిత్సలు ఇప్పుడు జంగారెడ్డిగూడెం వంటి ప్రాంతాల్లోని ప్రజలకు అందుబాటులోకి రావడం పట్ల డాక్టర్ రాజేష్ సంతోషం వ్యక్తం చేశారు. శస్త్రచికిత్స అంటేనే భయపడే రోజులు పోయాయని, చిన్న కోతతో చేసే లాపరోస్కోపీ వల్ల రక్తస్రావం తక్కువగా ఉంటుందని, ఇన్ఫెక్షన్ల భయం ఉండదని ఆయన వివరించారు. ఈ పద్ధతి ద్వారా ఆపరేషన్ చేయించుకున్న రోగులు కేవలం ఒకటి లేదా రెండు రోజుల్లోనే తమ సాధారణ పనులకు వెళ్లవచ్చని, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని శ్రామికులకు ఇది ఎంతో మేలు చేస్తుందని పేర్కొన్నారు.
అంతేకాకుండా వైద్య సాంకేతికత సామాన్యుడికి చేరువ కావడమే మా లక్ష్యం అని అపెండిసైటిస్, హెర్నియా, పిత్తాశయ సమస్యలు వంటి వ్యాధులకు అధునాతన లాపరోస్కోపీ పద్ధతి ద్వారా అత్యంత తక్కువ సమయంలో చికిత్స అందిస్తున్నామని, ప్రజలు వ్యాధి లక్షణాలను ముందే గుర్తించి, సరైన సమయంలో నిపుణులైన సర్జన్లను సంప్రదించాలని తెలిపారు అలాగే ఈ కార్యక్రమంలో రాజా హాస్పిటల్ సిబ్బంది మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
