ఉపాధి కూలీల బకాయి వేతనాలు చెల్లించాలి
Published on 01 Apr 2026, 06:59 PM 45
JH-29950
జనహితం న్యూస్, టీ నర్సాపురం మండలం: ఏలూరు జిల్లా టీ నర్సాపురం మండలంలోని బొర్రంపాలెం గ్రామంలో నీ ఉపాధి కూలీల బకాయి వేతనాలు వెంటనే ఇవ్వాలని గ్రామానికి చెందిన సామాజికవేత్త గుండె పాండురంగ బుధవారం పత్రిక ప్రకటన ద్వారా డిమాండ్ చేశారు.
గ్రామంలో గత 7 వారాలుగా కూలీలకు అధికారులు వేతనాలు ఇవ్వడం లేదన్నారు దీంతో కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలియజేశారు. పని జరిగే ప్రదేశంలో కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు వేసవి అలవెన్స్ లు కూడా ఇవ్వాలని కోరారు ఈ కార్యక్రమంలో ఉపాధి కూలీలు పాల్గొన్నారు
