హోమ్ హైదరాబాద్‌ జాతీయం అంతర్జాతీయం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ క్రీడలు ఎడ్యుకేషన్ & కెరీర్‌ బిజినెస్ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ క్రైమ్‌ సంపద వ్యవసాయం సినిమా ఈ-పేపర్
విజయసాగర్ ప్రాజెక్టు అభివృద్ధి  - ఎమ్మెల్యేకు వినతి JH-35889

జనహితం న్యూస్, టీ నర్సాపురం: పర్యావరణ పరిరక్షణ, భూగర్భ జల వనరుల పెంపు, సాగునీటి వసతి, రైతుల ప్రయోజనాలు, పర్యాటక కేంద్రం తదితర అన్ని హంగులు కలిగిన టీ నర్సాపురం నందమూరి విజయసాగర్ ప్రాజెక్టును ప్రభుత్వం అభివృద్ధి చేయాలని దీనికై ఎమ్మెల్యే గారు కృషి చేయాలని కోరుతూ టీ నర్సాపురం కి చెందిన సామాజిక కార్యకర్తలు బుధవారం నాడు బర్రింకలపాడు పోలవరం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో చిర్రి బాలరాజు గారిని కలిసి సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు.

ఈ సందర్భంగా సామాజిక కార్యకర్త యస్ డి నా సర్ పాషా మాట్లాడుతూ నలభై ఏళ్ళ క్రితం అప్పటి ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి పేరుపై పెద్ద చెరువును నందమూరి విజయసాగర్ గా నామకరణం చేసి మధ్యతరహా ప్రాజెక్టుగా అభివృద్ధి చేశారని ఇటీవల రైతుల, సామాజిక కార్యకర్తల అభ్యర్థన మేరకు ప్రాజెక్టు కట్టపై పిచ్చి మొక్కలను తొలగించారని ఈ చర్య పట్ల హర్షం వ్యక్తం చేస్తూ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో చెరువులో పూడిక తీపించాలని, తద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు టి నర్సాపురం ప్రాంత భూగర్భ జల వనరులు పెరుగుతాయనీ, ఈ చర్య వ్యవసారంగానికి ఎంతో ప్రోత్సాహం అని, దీంతోపాటు నలభై ఏళ్ల క్రితం నిర్వహించిన కట్ట సామర్థ్యం పెంచాలని, ఆక్రమణలు తొలగించి నీటి నిలువ సామర్థ్యం పెంచాలని, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని ఎమ్మెల్యే గారిని కోరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్తలు కొరివి శేషారావు, పింగుల మధు తదితరులు పాల్గొన్నారు.

Click to join Whatsapp channel
Janahitham News
విజయసాగర్ ప్రాజెక్టు అభివృద్ధి - ఎమ్మెల్యేకు వినతి
విజయసాగర్ ప్రాజెక్టు అభివృద్ధి  - ఎమ్మెల్యేకు వినతి

→ కొవ్వలి రవితేజ - రిపోర్టర్