హోమ్ హైదరాబాద్‌ జాతీయం అంతర్జాతీయం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ క్రీడలు ఎడ్యుకేషన్ & కెరీర్‌ బిజినెస్ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ క్రైమ్‌ సంపద వ్యవసాయం సినిమా ఈ-పేపర్
కార్మిక చట్టాల కోసం పోరాటం - భగత్ సింగ్ స్ఫూర్తితో పిలుపు JH-23931

జనహితం న్యూస్, టీ నర్సాపురం: ఆనాటి బ్రిటిష్ అసెంబ్లీలో పొగ బాంబురేసి ధైర్య సాహసాలు ప్రదర్శించిన ఎప్రిల్ 8 నేటికి 97 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా కార్మిక హక్కుల పరిరక్షణ కోసం దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేయాలని ఐ ఎఫ్ టి యు జాతీయ కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా జంగారెడ్డిగూడెం భగత్ సింగ్ విగ్రహం వద్ద ఆయన విగ్రహానికి ఇఫ్టూ నాయకులు గంపల శ్రీను పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఐ ఎఫ్ టి యు రాష్ట్ర ఉపాధ్యక్షులు కెవి రమణ మాట్లాడుతూ ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం తీసుకువచ్చిన ట్రేడ్ బిల్లుకు వ్యతిరేకంగా భగత్ సింగ్, బటుకేశ్వర దత్ ఆనాడు అసెంబ్లీగా పిలవబడే బ్రిటిష్ పార్లమెంటులో పొగ బాంబులేసి దేశ ప్రజలను చైతన్యం చేస్తూ అరెస్టయ్యారు అని ఆ తర్వాత నవ్వుతూ భగత్ సింగ్ ఉరికంబం ఎక్కడని ట్రేడ్ బిల్లుకు వ్యతిరేకంగా భారత ప్రజలను చైతన్యవంతం చేసే భాగంలో ప్రజానికం అంతా స్పందించాలని ఆనాడు అసెంబ్లీలో ఒక బాంబులేసి ధైర్య సాహసాలు ప్రదర్శించారని ఆ తర్వాత జైలు జీవిత కాలంలో కూడా బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలను చైతన్యవంతం చేస్తూ అనేక రచనలు చేశారని నేటి యువకులు భగత్ సింగ్ స్ఫూర్తితో కేంద్రం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా ఉద్యమించాలని అన్నారు.

కేంద్ర ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను రద్దు చేసిందని కార్మికులు అనేక పోరాటాలు చేసి తమ రక్తాన్ని చిందించి సాధించుకున్న కార్మిక హక్కులు కార్మిక చట్టాలను ఒక్క కలం పోటుతో కేంద్రం రద్దు చేసిందని కార్మిక చట్టాలను నిలబెట్టుకోవడం కోసం కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా చేసిన నాలుగు లేబర్ కోడ్స్ రద్దు అయ్యే వరకు కార్మికులు ఉద్యమించాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో వసంతాటి సత్యనారాయణ కొత్తూరి శ్రీను కొత్తూరి సుబ్బారావు ముప్పిడి సత్యనారాయణ కే శ్రీను జయరాజు ఉర్లాపు రాంబాబు కొత్తూరు అబ్బులు కొత్తూరు నాని కలపాల రామయ్య కే శ్రీను తదితరులు పాల్గొన్నారు

Click to join Whatsapp channel
Janahitham News
కార్మిక చట్టాల కోసం పోరాటం - భగత్ సింగ్ స్ఫూర్తితో పిలుపు
కార్మిక చట్టాల కోసం పోరాటం - భగత్ సింగ్ స్ఫూర్తితో పిలుపు

→ కొవ్వలి రవితేజ - రిపోర్టర్