హోమ్ హైదరాబాద్‌ జాతీయం అంతర్జాతీయం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ క్రీడలు ఎడ్యుకేషన్ & కెరీర్‌ బిజినెస్ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ క్రైమ్‌ సంపద వ్యవసాయం సినిమా ఈ-పేపర్
జీలుగుమిల్లి వద్ద అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్ట్ ప్రారంభం JH-22127

​జనహితం న్యూస్, టీ నర్సాపురం: ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ సరిహద్దుల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తూ, ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలంలోని తాటియాకులగూడెం వద్ద నూతన పోలీస్ బోర్డర్ చెక్‌పోస్ట్‌ను గురువారం అధికారులు అధికారికంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా సరిహద్దు ప్రాంతాల్లో నిఘాను పెంచడమే కాకుండా, అక్రమ రవాణాను అడ్డుకోవడమే ప్రధాన లక్ష్యమని అధికారులు పేర్కొన్నారు.

​ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పోలవరం డీఎస్పీ వెంకటేశ్వరరావు, సీఐ వెంకటేశ్వరరావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. వీరితో పాటు జీలుగుమిల్లి ఎస్సై క్రాంతి కుమార్, బుట్టాయగూడెం మరియు టి.నర్సాపురం జయబాబు ఎస్సైలు కూడా హాజరయ్యారు. సరిహద్దు గుండా వెళ్లే వాహనాల కదలికలను నిరంతరం పర్యవేక్షించేందుకు ఈ చెక్‌పోస్ట్ కీలక భూమిక పోషిస్తుందని వారు తెలిపారు.

​ఈ సందర్భంగా డీఎస్పీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే అనుమతించాలి.

​అనుమానాస్పద రవాణా, ముఖ్యంగా అక్రమ మద్యం, గంజాయి మరియు ఇతర నిషేధిత వస్తువుల సరఫరాపై నిఘా ఉంచాలి.విధుల్లో ఉన్న సిబ్బంది 24 గంటల పాటు అప్రమత్తంగా ఉంటూ శాంతిభద్రతల పరిరక్షణకు సహకరించాలి అని తెలిపారు

Click to join Whatsapp channel
Janahitham News
జీలుగుమిల్లి వద్ద అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్ట్ ప్రారంభం
జీలుగుమిల్లి వద్ద అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్ట్ ప్రారంభం

→ కొవ్వలి రవితేజ - రిపోర్టర్