'రూర్బన్' పేరుతో ఉపాధి హామీకి గండి: వ్యవసాయ కార్మిక సంఘం ధ్వజం
Published on 27 Mar 2026, 06:30 PM 31
JH-74961
జనహితం న్యూస్, టీ నర్సాపురం: ఏలూరు జిల్లా టీ నర్సాపురం మండలంలో వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 'రూర్బన్' పథకం పేరుతో పేదల పొట్ట కొడుతున్నాయని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు గూడెల్లి వెంకట్రావు తీవ్రస్థాయిలో విమర్శించారు. శుక్రవారం టీ. నరసాపురంలో కాకి శరమయ్య అధ్యక్షతన జరిగిన మండల కమిటీ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు.
ఈ సందర్భంగా వెంకట్రావు మాట్లాడుతూ, 2005 ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్రంలోని కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. కొత్త చట్టాల పేరుతో ప్రజలను మోసం చేస్తూ, పేదల ఉపాధి హక్కును కాలరాస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం సైతం రూర్బన్ పంచాయతీల పేరుతో వేలాది మంది కూలీలకు పని దినాలను దూరం చేస్తోందని, ఇది అత్యంత దారుణమని పేర్కొన్నారు.ఉపాధి హామీని దెబ్బతీసే రూర్బన్ పంచాయతీల విధానాన్ని తక్షణమే రద్దు చేయాలి.
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యథాతథంగా అమలు చేయాలి, గత ఏడాదికి సంబంధించిన నిధులతో పాటు, ప్రస్తుత పని దినాల ఉపాధి కూలీల బకాయిలను వెంటనే చెల్లించాలి.
ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు బరగడ కుమారి, పొట్ట ముత్యాలరావు, రాంబాబు, మేడిపల్లి గీత, కలపాల గాంధీ, బేబీ షాలిని తదితరులు పాల్గొన్నారు.
