ఏలూరు అదనపు ఎస్పీ ఎన్. సూర్య చంద్రరావుకు ఎస్పీగా పదోన్నతి – అధికారుల అభినందనలు
Published on 27 Mar 2026, 10:03 PM 18
JH-98055
జనహితం న్యూస్, ఏలూరు జిల్లా: ఏలూరు జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ గా విధులు నిర్వహిస్తున్న శ్రీ ఎన్. సూర్యచంద్రరావు గారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నాన్-క్యాడర్ ఎస్పీ గా పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఆయన నిబద్ధత, సుదీర్ఘ అనుభవం మరియు పోలీస్ శాఖలో ఆయన అందించిన విశేష సేవలను గుర్తిస్తూ ప్రభుత్వం ఈ పదోన్నతిని కల్పించింది.
పదోన్నతి పొందిన శ్రీ ఎన్. సూర్య చంద్రరావు గారిని ఇతర పోలీస్ అధికారులు ఘనంగా అభినందించారు.
జిల్లాలోని పలువురు డీఎస్పీలు, సిఐలు, ఎస్సైలు మరియు పోలీస్ అసోసియేషన్ సభ్యులు ఆయనను కలిసి పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా పదోన్నతి పొందిన ఎస్పీ శ్రీ సూర్యచంద్రరావు గారు మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగిం చిన ప్రభుత్వానికి మరియు తనకు అండగా నిలిచిన ఏలూరు జిల్లా ఎస్పీ శ్రీ కె ప్రతాప్ శివ కిషోర్ ఐపీఎస్ వారికి అధికారులకు సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియ చేసినారు.
రాబోయే రోజుల్లో ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందిస్తానని ఆయన పేర్కొన్నారు.
జిల్లా పోలీస్ యంత్రాంగం అంతా ఆయనకు లభించిన ఈ పదోన్నతి పట్ల హర్షం వ్యక్తం చేస్తూ, ఆయన ఉన్నత పదవులను అధిరోహించాలని ఆకాంక్షించారు.
