హోమ్ హైదరాబాద్‌ జాతీయం అంతర్జాతీయం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ క్రీడలు ఎడ్యుకేషన్ & కెరీర్‌ బిజినెస్ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ క్రైమ్‌ సంపద వ్యవసాయం సినిమా ఈ-పేపర్
​జంగారెడ్డిగూడెంను నియోజకవర్గంగా ప్రకటించాలి: రౌండ్ టేబుల్ సమావేశంలో డిమాండ్ JH-75324

జనహితం న్యూస్, జంగారెడ్డిగూడెం: త్వరలో జరగబోయే నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియలో జంగారెడ్డిగూడెంను అసెంబ్లీ మరియు పార్లమెంట్ నియోజకవర్గంగా ఏర్పాటు చేయాలని కోరుతూ పట్టణంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశం విజయవంతమైంది. సీనియర్ జర్నలిస్ట్ కె. శంకర్రావు, ప్రముఖ అధ్యాపకులు మర్రి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీల నేతలు, ప్రజా సంఘాల ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

డా. దాసరి శ్యామ్ చంద్ర శేషు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి డా. దాసరి శ్యామ్ చంద్ర శేషు మాట్లాడుతూ, జంగారెడ్డిగూడెం ప్రాంతానికి ఉన్న భౌగోళిక, ఆర్థిక మరియు చారిత్రక ప్రాధాన్యతను వివరించారు. ఈ ప్రాంత అభివృద్ధి వేగవంతం కావాలంటే దీనిని విడిగా నియోజకవర్గంగా గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

​ఈ లక్ష్య సాధన కోసం అన్ని వర్గాలతో కలిపి ఒక జేఏసీ ని ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. ఈ పోరాటంలో తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని, తన వంతు పూర్తి సహకారాన్ని అందిస్తానని ఆయన హామీ ఇచ్చారు.​

ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో రాజకీయాలకు అతీతంగా టిడిపి, జనసేన, బిజెపి, కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ మరియు వామపక్ష పార్టీల ప్రతినిధులు పాల్గొని తమ మద్దతును ప్రకటించారు. జంగారెడ్డిగూడెంను నియోజకవర్గంగా మార్చడం ద్వారానే స్థానిక సమస్యలకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రజా సంఘాల ప్రతినిధులు, పట్టణ ప్రముఖులు నాయకులు పాల్గొని, పునర్విభజన అంశంపై ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని తీర్మానించారు.

Click to join Whatsapp channel
Janahitham News
​జంగారెడ్డిగూడెంను నియోజకవర్గంగా ప్రకటించాలి: రౌండ్ టేబుల్ సమావేశంలో డిమాండ్
​జంగారెడ్డిగూడెంను నియోజకవర్గంగా ప్రకటించాలి: రౌండ్ టేబుల్ సమావేశంలో డిమాండ్

→ కొవ్వలి రవితేజ - రిపోర్టర్