హోమ్ హైదరాబాద్‌ జాతీయం అంతర్జాతీయం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ క్రీడలు ఎడ్యుకేషన్ & కెరీర్‌ బిజినెస్ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ క్రైమ్‌ సంపద వ్యవసాయం సినిమా ఈ-పేపర్
టీ నర్సాపురంలో టీడీపీ 44వ వేడుకలు – శీలం వెంకటేశ్వరరావు హాజరు JH-65931

జనహితం న్యూస్, టీ నర్సాపురం: ఏలూరు జిల్లా టీ నర్సాపురం మండలం లోని తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఆదివారం ఏలూరు జిల్లా టీ. నర్సాపురం మండల కేంద్రంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. స్థానిక అంబేద్కర్ సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి శీలం వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని, పార్టీ జెండాను ఆవిష్కరించారు.

​ఈ సందర్భంగా శీలం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, పార్టీ ఆశయాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని, కార్యకర్తలు ఐక్యమత్యంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. అలాగే ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. పార్టీ సీనియర్ నాయకులు ​కాల్నిడి రాంబాబు, ​గ్రామ కమిటీ అధ్యక్షులు కొల్లి రమేష్,​సెక్రటరీ జోనబోయిన శేషరావు, ​సొసైటీ చైర్ పర్సన్ జోనబోయిన సోంబాబు, ​మండల తెలుగుయువత అధ్యక్షులు కె. శ్రీనివాస్ ​అంతేకాకుండా మాజీ వైస్ ఎంపీపీ అర్ధంకి జగ్గారావు, నీటి సంఘ అధ్యక్షులు కోనకల్లా మోహన్ రావు, నాయకులు మోదుగు రామారావు, కిలారి సాంబశివరావు, కొల్లి మురళి, ఏపుకుంట సాధనాల భూసిబాబు, బాషా తదితరులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. పార్టీ పటిష్టతకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ సందర్భంగా నాయకులు ఆకాంక్షించారు.

Click to join Whatsapp channel
Janahitham News
టీ నర్సాపురంలో టీడీపీ 44వ వేడుకలు – శీలం వెంకటేశ్వరరావు హాజరు
టీ నర్సాపురంలో టీడీపీ 44వ వేడుకలు – శీలం వెంకటేశ్వరరావు హాజరు

→ కొవ్వలి రవితేజ - రిపోర్టర్