హోమ్ హైదరాబాద్‌ జాతీయం అంతర్జాతీయం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ క్రీడలు ఎడ్యుకేషన్ & కెరీర్‌ బిజినెస్ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ క్రైమ్‌ సంపద వ్యవసాయం సినిమా ఈ-పేపర్
ఘనంగా టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు JH-83264

జనహితం న్యూస్, టీ నర్సాపురం: ఏలూరు జిల్లా టీ నర్సాపురం మండలం తిరుమల దేవి పేటలో ఉన్న ఎస్సీ పేట నందు పార్టీ జెండాను ఆవిష్కరించిన తెలుగుదేశం పార్టీ యువ నాయకులు తోట లక్ష్మీనారాయణ మాట్లాడుతూ... తెలుగువారి ఆత్మగౌరవ ప్రతీక తెలుగుదేశం పార్టీ అని, ఆ పార్టీ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే ప్రతి కార్యకర్త లక్ష్యం కావాలని తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి తోట లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు. ఆదివారం ఏలూరు జిల్లా టీ. నర్సాపురం మండలం, తిరుమలదేవిపేట పంచాయతీ పరిధిలోని ఎస్సీ పేట కాలనీ పార్టీ కార్యాలయంలో టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.

​ఈ సందర్భంగా తోట లక్ష్మీనారాయణ పార్టీ జెండాను ఆవిష్కరించి, కేక్ కట్ చేసి కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు తెలుగు గర్వాన్ని ప్రపంచానికి చాటిచెప్పాలనే మహత్తర లక్ష్యంతో ఈ పార్టీని స్థాపించారని గుర్తుచేశారు. నేడు పార్టీ 44 వసంతాలు పూర్తి చేసుకోవడం ప్రతి తెలుగుదేశం సైనికుడికి గర్వకారణమని హర్షం వ్యక్తం చేశారు. అలాగే సామాన్య ప్రజల అభివృద్ధి కోసం, వారి ఆత్మగౌరవం కోసం టీడీపీ ఎన్నో విప్లవాత్మక సంక్షేమ పథకాలను అమలు చేసిందని కొనియాడారు. కష్టకాలంలోనూ, విజయాల్లోనూ పసుపు జెండాను గుండెల్లో పెట్టుకుని కాపాడుతున్న ప్రతి కార్యకర్త ఒక సైనికుడిలా పని చేస్తున్నారని ఆయన ప్రశంసించారు.

పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లి, ప్రజల ఆశయాల నెరవేర్పు కోసం ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు.

​ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ ప్రెసిడెంట్ మాధ్యాహ్నపు సురేష్, తోట పండు, నాయుడు, తోట శ్రీను, మన్నెం దుర్గారావవు, కాసగాని వీర్రాజు, పాపచారి వీరేషలింగం, అబ్బదాసరి పండు, స్థానిక పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొని ఉత్సాహంగా నినాదాలు చేశారు.

Click to join Whatsapp channel
Janahitham News
ఘనంగా టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
ఘనంగా టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

→ కొవ్వలి రవితేజ - రిపోర్టర్