హోమ్ హైదరాబాద్‌ జాతీయం అంతర్జాతీయం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ క్రీడలు ఎడ్యుకేషన్ & కెరీర్‌ బిజినెస్ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ క్రైమ్‌ సంపద వ్యవసాయం సినిమా ఈ-పేపర్
రాత్రిళ్లు దందా, పగలు నిశ్శబ్దం – కుక్కునూరులో ఇసుక మాఫియా JH-52733

జనహితం న్యూస్, కుక్కునూరు: ఏలూరు జిల్లా కుక్కునూరు మండలంలోని దాచారం గోదావరి నది తీరం నుంచి ఇసుక దందా ఇష్టారాజ్యంగా సాగుతుంది ఆంధ్ర అంతా ఇసుక ఫ్రీ అవ్వడంతో తెలంగాణకు ఇసుక డిమాండ్ పెరగడంతో ఏజెన్సీ అయిన కుక్కునూరు, ఇబ్రహీంపేట మండలాల్లోని ఇసుకను తెలంగాణ తరలించడానికి శతవిధాల గా ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో విజిలెన్స్ దాడులు నిర్వహించిన కొన్ని రోజులు నిలుపుదల చేసి మరల మళ్లీ యధావిధిగా దందాను కొనసాగిస్తున్నారు, అధికారులను మేనేజ్ చేసుకుంటూ దందాను కొనసాగిస్తున్నారు, ఈ దందాను ఆపేవారు లేరు, అడిగే వారు లేరు, అనే విధంగా వ్యాపారం సాగిస్తున్నారు, ఇక రాత్రిపూట లారీలు బయలుదేరీ ఇస్టాను రాజ్యాంగ వెళుతున్నాయి, గతంలో విజిలెన్స్ అధికారులు తనిఖీలలో సొసైటీ వారికి రెవెన్యూ అధికారులకు గట్టి హెచ్చరికలు జారీ చేసినప్పటికీ కొంతకాలం ఉపశమనం ఇచ్చి మరల మళ్లీ యధావిధిగా అక్రమ రవాణాకు అడ్డే లేనట్లుగా సాగిస్తున్నారు.

దీనిపై ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి సొసైటీ పేరుతో నడుస్తున్న అక్రమ దారులకు అడ్డుకట్ట వేసి కుక్కునూరు మండలంలోని ఇసుక ర్యాంపులకు సొసైటీ వారికి తప్ప వేరే అనధికారి వ్యక్తులకు రాంపుల్లోకి వెళ్ళటానికి అవకాశాలు లేకుండా చర్యలు తీసుకోవాలి. కుక్కునూరు మండలం మారుమూల ఏజెన్సీ అవ్వడంతో ఇక్కడ అభివృద్ధి అంతంత మాత్రమే ఉండడంతో ఇసుక అక్రమ రవాణా చేసే టిప్పర్లు హెవీ లోడుతో వెళ్లడంతో రోడ్లు ధ్వంసం అవుతున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మార్చి 28న జిల్లాలోని అక్రమ మట్టి తవ్వకాలకు కానీ అక్రమ ఇసుక రవాణా కానీ చేసే వారిపై కేసులు నమోదు చేయాలని ఏలూరు జిల్లా కలెక్టర్ కె. వెట్రి సెల్వి ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఆదేశాలను తుంగలో తొక్కి ఇష్టను రాజ్యాంగ కుక్కునూరు మండలంలోని ఇసుక మైనింగ్ మాఫియా జరుగుతుంది. దీనిపై ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తక్షణమే ఆ మైనింగ్ మాఫియా పై చర్యలు తీసుకోవాలని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Click to join Whatsapp channel
Janahitham News
రాత్రిళ్లు దందా, పగలు నిశ్శబ్దం – కుక్కునూరులో ఇసుక మాఫియా
రాత్రిళ్లు దందా, పగలు నిశ్శబ్దం – కుక్కునూరులో ఇసుక మాఫియా

→ కొవ్వలి రవితేజ - రిపోర్టర్