కుక్కునూరు ఐసీడీఎస్ కార్యాలయం వద్ద అంగన్వాడి ల భారీ ధర్నా
Published on 31 Mar 2026, 11:16 PM 11
JH-29374
జనహితం న్యూస్, కుక్కునూరు: రూ. 26 వేల కనీస వేతనం కోసం నినాదాలు.. సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరిక.
అంగన్వాడీలకు నెలకు రూ. 26,000 కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఏలూరు జిల్లా కుక్కునూరులోని ఐసీడీఎస్ ప్రాజెక్ట్ కార్యాలయం వద్ద మంగళవారం భారీ ధర్నా నిర్వహించారు. సీఐటీయూ ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో మండలంలోని అంగన్వాడి కార్యకర్తలు, ఆయాలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
అంగన్వాడీలకు నెలకు రూ. 26,000 కనీస వేతనం వెంటనే అమలు చేయాలి. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన లేబర్ కోడ్‌లను తక్షణమే రద్దు చేయాలి. అంగన్వాడీలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను వర్తింపజేయాలి. పని ఒత్తిడిని తగ్గించి, ఉద్యోగ భద్రత కల్పించాలి.
ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ, ఏళ్ల తరబడి అంగన్వాడీలు చాలిచాలని వేతనాలతో సేవలు అందిస్తున్నారని, ప్రస్తుత ధరల పెరుగుదలకు అనుగుణంగా వేతనాలు పెంచకపోవడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు అంగన్వాడీల సమస్యలను నిర్లక్ష్యం చేస్తున్నాయని, తక్షణమే స్పందించి సమస్యలు పరిష్కరించకపోతే రానున్న రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలను ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఐసీడీఎస్ అధికారులకు అందజేశారు.