ఉపాధి హామీ పనులను ప్రారంభించిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి శీలం వెంకటేశ్వరరావు
Published on 07 Apr 2026, 05:08 PM 67
JH-61127
జనహితం న్యూస్, టీ నర్సాపురం: ఏలూరు జిల్లా టీ నర్సాపురం మండలం వెలగపాడు పంచాయతీ వీరభద్రవరం గ్రామంలో ఉపాధి హామీ పనులను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి, జగ్గంపేట నియోజకవర్గ పరిశీలకులు శీలం వెంకటేశ్వరరావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మల్లు కుంట సొసైటీ చైర్మన్ శీలం సాయి వినయ్ కుమార్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా శీలం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రభుత్వం నిర్దేశించిన కొలతల ప్రకారం ఉపాధి హామీ పనులు సక్రమంగా చేయాలని సూచించారు.
ఉపాధి హామీ కూలీలకు ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా తన దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకుంటానని ఆయన హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ చింతపల్లి నాగు, కూటమి నాయకులు గుడిదెల పెంటయ్య, జోను బోయిన సత్యనారాయణ, టీ నర్సాపురం మండలం తెలుగు యువత ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎర్ర గొర్ల సుబ్బారావు, తుమ్మల రాములు, తట్టుకోళ్ళు సుబ్బారావు మరియు ఉపాధి శ్రామికులు పాల్గొన్నారు.
