రైతు నేస్తం క్రాప్ లోన్ చెక్కుల పంపిణీ
Published on 07 Apr 2026, 05:03 PM 110
JH-57526
జనహితం న్యూస్, టీ నర్సాపురం: ఏలూరు జిల్లా టి నర్సాపురం మండలం మల్లు కుంట సొసైటీ లో రైతు నేస్తం క్రాప్ లోన్ చెక్కుల పంపిణీ చేసిన మల్లు కుంట సొసైటీ చైర్మన్ శీలం సాయి వినయ్ కుమార్ చేతుల మీదుగా రైతులకు చెక్కులు పంపిణీ చేయడం జరిగింది.
సొసైటీ చైర్మన్ శీలం సాయి వినయ్ కుమార్ ముఖ్యఅతిథిగా పాల్గొని ఆయన మాట్లాడుతూ ప్రతి రైతుకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రతి రైతుకు సకాలంలో పంట వేసుకునేందుకు రైతులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ప్రతి ఒక్క రైతు వేసిన పంటలను సాగు చేయుటకు క్రాఫ్ లోన్లు చేసి రైతులకు అందించడంలో కూటమి ప్రభుత్వం ఎంతో అండగా ఉంటుందని ఆయన తెలియజేశారు 1155000/_ మల్ల కుంట సొసైటీ పరిధిలో ఉన్న 7 గురు రైతులకు ఈ చెక్కులు పంపిణీ చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మల్ల కుంట సొసైటీ CEO K.V.V సత్యనారాయణ మరియు సొసైటీ సిబ్బంది అలాగే రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
