ప్రతి రైతుకి అండగా ఉంటా - చింతలపూడి ఎమ్మెల్యే
Published on 07 Apr 2026, 08:05 AM 84
JH-93518
జనహిత న్యూస్, చింతలపూడి: అకాల వర్షం కారణంగా లింగపాలెం మండలంలో పూర్తిగా పంట నష్టం వాటిల్లింది. చేతికొచ్చిన మొక్కజొన్న పంట వర్షం కారణంగా తడిచిపోవటం వల్ల ప్రతి రైతుకు నష్ట పరిహారం అందేలా తన వంతు కృషి చేస్తానని రైతులకు ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు.
సోమవారం ఏలూరు జిల్లాలో కురిసిన అకాల వర్షాలతో లింగపాలెం మండలం ధర్మాజీగూడెంలో వివిధ మొక్కజొన్న ఫ్యాక్టరిలా వద్దకు వెళ్లి పరిశీలించి చేతికి వచ్చిన పంట వల్ల నష్టపోయిన రైతులందరినీ ఆదుకుంటామని చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ నష్టపోయిన రైతులకు భరోసా ఇచ్చారు. పంటనష్టం అంచనా వేసేందుకు అధికార యంత్రాంగం క్షేత్రస్థాయిలో రేపటి నుంచి పర్యటించేలా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నష్టపోయిన ప్రతి రైతును ప్రభుత్వపరంగా అండగా నిలుస్తామని ఎమ్మెల్యే రోషన్ కుమార్ ధైర్యం చెప్పారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తో పాటు అధికారులు కూటమి నాయకులు పాల్గొన్నారు.
