హోమ్ హైదరాబాద్‌ జాతీయం అంతర్జాతీయం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ క్రీడలు ఎడ్యుకేషన్ & కెరీర్‌ బిజినెస్ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ క్రైమ్‌ సంపద వ్యవసాయం సినిమా ఈ-పేపర్
భారీగా కురిసిన వర్షానికి ఒక్కసారిగా పడ్డ తాటిచెట్టు JH-69044

జనహితం న్యూస్, జంగారెడ్డిగూడెం: ఏలూరు జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జంగారెడ్డిగూడెం మండలం దేవులపల్లి గ్రామంలో అనుకోని ప్రమాదం చోటుచేసుకుంది. వర్షం నుండి రక్షణ కోసం షెడ్డు (సెటర్) కింద పార్క్ చేసిన బైక్‌లపై ఒక్కసారిగా తాటిచెట్టు విరిగిపడింది. కురుస్తున్న వర్షం నుండి తడవకుండా ఉండేందుకు స్థానికులు తమ బైక్‌లను ఒక షెడ్డు కింద నిలిపి ఉంచారు. అయితే, బలమైన గాలుల ధాటికి సమీపంలోని తాటిచెట్టు ఒక్కసారిగా ఆ షెడ్డుపై విరిగిపడింది.

ఈ ప్రమాదంలో అక్కడ ఉన్న రెండు పల్సర్ బైక్‌లు చెట్టు కింద ఇరుక్కుపోయాయి. అందులో ఒక బైక్ పూర్తిగా విరిగిపోయి, పార్ట్స్ అన్నీ ధ్వంసమయ్యాయి.ప్రమాదానికి గురైన వాహనాల్లో ఒకటి స్థానిక న్యూస్ రిపోర్టర్ ఎల్లే రవీంద్రకు చెందిన పల్సర్ బైక్‌గా గుర్తించారు. ఈ ఘటన జరిగిన సమయంలో వాహనాలపై ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రాణాపాయం తప్పింది. కేవలం ఆస్తి నష్టం మాత్రమే సంభవించడంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు.

Click to join Whatsapp channel
Janahitham News
భారీగా కురిసిన వర్షానికి ఒక్కసారిగా పడ్డ తాటిచెట్టు
భారీగా కురిసిన వర్షానికి ఒక్కసారిగా పడ్డ తాటిచెట్టు

→ కొవ్వలి రవితేజ - రిపోర్టర్