ఘనంగా భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ జన్మదిన వేడుకలు
Published on 05 Apr 2026, 05:53 PM 85
JH-56390
జనహితం న్యూస్, టీ నర్సాపురం: ఏలూరు జిల్లా టీ నర్సాపురం మండలం లో టీ నర్సాపురం మండలం మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మరియు దళిత సంఘాల ఆధ్వర్యంలో డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ జన్మదిన వేడుకలు అంబరాన్ని అంటాయి ముఖ్యఅతిథిగా టీ నర్సాపురం మండలం సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ జయ బాబు హాజరయ్యారు ఆయన మాట్లాడుతూ..,
ప్రముఖ రాజనీతిజ్ఞుడు బాబు జగజ్జీవన్ రామ్, సేవలు చిరస్మరణీయం...
స్వాతంత్ర సమరయోధులు, సామాజిక న్యాయం కోసం పోరాడిన జాతీయ నేత బాబు జగజ్జీవన్ రామ్ దేశానికి చేసిన సేవలు చరస్మరణీయమని టీ నర్సాపురం స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్ ఐ) ఎస్ జయబాబు అన్నారు.
టీ నర్సాపురం మండలానికి చెందిన బాబు జగజ్జీవన్ రామ్ జయంతి నిర్వహణ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో టీ నర్సాపురం మండల కార్యాలయల సమీపంలో దళిత సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహం వద్ద జయంతి వేడుకలు ఘనంగా జరిపారు. ముఖ్య అతిథి నిర్వాహకులతో కలిసి ముందుగా జగజ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించారు. ప్రత్యేక అవసరాలు కలిగిన బాలుడు డోలా గౌతమ్ కు కేక్ తినిపించారు. అనంతరం బాబు జగజీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జోహార్ బాబు జగజీవన్ రామ్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నినాదాలు చేశారు.
అనంతరం ఎం ఆర్ ఎస్ సీనియర్ నాయకులు నార్లపాటి దుర్గారావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథి ఎస్ఐ జయ బాబు గారు మాట్లాడుతూ జాతీయ నాయకులు బాబు జగజ్జీవన్ రామ్ 1908 ఏప్రిల్ ఐదవ తేదీన బీహార్ రాష్ట్రంలో జన్మించారని, ఆయన భారత స్వాతంత్ర్య ఉద్యమకారుడనీ, హరిత విప్లవ ప్రదాత, ప్రముఖ రాజనీతిజ్ఞుడు. భారత మాజీ ఉప ప్రధాని, కేంద్ర మంత్రిగా వివిధ శాఖల్లో పనిచేశారు. సామాజిక న్యాయం కోసం పోరాడిన నాయకుడు.
దళితుల సాధికారత కోసం కృషి చేసిన మహానుడిని ఆయన కొనియాడారు, నేటి తరానికి ఆయన సేవలు స్ఫూర్తి దాయకమని నేటి యువత ఆయన బాటలో నడవాలని ఆయన కోరారు, బాబు జగజీవన్ రామ్ జయంతి వేడుకల నిర్వహ కమిటీ సభ్యులను ఆయన అభినందించారు.
ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథిగా సామాజిక కార్యకర్త యస్ డి నా సర్ పాషా, జయంతి నిర్వహణ కమిటీ సభ్యులు నారపాము దుర్గారావు, నార్లపాటి దుర్గారావు, రాయల పేరయ్య, పింగుల మధు, గంధం రామకృష్ణ, బొక్కా శ్రీను, కోలుకులూరి రాంబాబు, డోలా వరప్రసాద్, కోటా నరేష్ తదితరులు పాల్గొన్నారు.
