నూతన వధూవరులను ఆశీర్వదించిన రాష్ట్ర టిడిపి కార్యదర్శి శీలం వెంకటేశ్వరరావు
Published on 31 Mar 2026, 04:54 PM 32
JH-78421
జనహితం న్యూస్, టీ నర్సాపురం: ఏలూరు జిల్లా టీ. నర్సాపురం మండలం అల్లం చర్ల కొత్తగూడెంలో జనసేన యువ నాయకుడు కలిశెట్టి సాయి - అక్షయల వివాహ రిసెప్షన్ వేడుక మంగళవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి శీలం వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
రిసెప్షన్ వేడుకకు చేరుకున్న శీలం వెంకటేశ్వరరావుకు స్థానిక నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆయన నూతన వధూవరులను ఆశీర్వదించి, వారికి శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు మండల టిడిపి ప్రధాన కార్యదర్శి వెలిది నాగబాబు, వేపగుంట పంచాయతీ టిడిపి అధ్యక్షులు సాధనాల బూసి బాబు, సీనియర్ నాయకులు కలిశెట్టి పార్థసారథి, కొప్పుల గంగ బాబు, కుమారస్వామి మరియు పలువురు స్థానిక టిడిపి నేతలు పాల్గొన్నారు.
రాష్ట్ర స్థాయి నేత అయిన శీలం వెంకటేశ్వరరావు రాకతో వేడుక ప్రాంగణంలో రాజకీయ సందడి నెలకొంది. నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఆయనను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.
