పోలవరం టీడీపీ కార్యాలయంలో సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ
Published on 28 Mar 2026, 04:42 PM 63
JH-75986
జనహితం న్యూస్, పోలవరం నియోజకవర్గం: ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సీఎం సహాయనిధి ద్వారా లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పోలవరం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ట్రైకార్ చైర్మన్ బొరగం శ్రీనివాసులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆరోగ్యమే మహాభాగ్యమని, ఆరోగ్యవంతమైన సమాజం ద్వారానే అభివృద్ధి సాధ్యమని తెలిపారు. కుటుంబంలో ఒకరు అనారోగ్యం పాలైతే మొత్తం కుటుంబం ఇబ్బందులు ఎదుర్కొంటుందని పేర్కొన్నారు. కష్టకాలంలో ప్రజలను ఆదుకుంటున్న రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలిపారు.
టి. నరసాపురం మండలం నుంచి పుట్ట లక్ష్మీ రమ్య, వస్తశావాయ సత్యలక్ష్మి కుమారి, సాయిలు చెన్నారావు, వెంగళ కృష్ణారెడ్డి, బుట్టాయగూడెం మండలం నుంచి కణితి భీమరాజు, కుక్కునూర్ మండలం నుంచి కోట శ్రీను, జిన్నే సత్యవేణి గార్లకు మొత్తం రూ. 4 లక్షల 32 వేల విలువైన చెక్కులు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు మొగపర్తి సోంబాబు, ఏఎంసీ చైర్మన్ పొట్ట రామారావు, ఏఎంసీ డైరెక్టర్ జారం చాందిని, జీసీసీ డైరెక్టర్ మడకం కనపరాజు, సీనియర్ నాయకులు గద్దె అబ్బులు, దెయ్యాల కృష్ణమోహన్, మడకం రామకృష్ణ, కేరం వెంకటేశ్వరరావు, తెలుగుయువత మండల అధ్యక్షుడు కల్నిడి వాసు తదితరులు పాల్గొన్నారు.
