హోమ్ హైదరాబాద్‌ జాతీయం అంతర్జాతీయం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ క్రీడలు ఎడ్యుకేషన్ & కెరీర్‌ బిజినెస్ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ క్రైమ్‌ సంపద వ్యవసాయం సినిమా ఈ-పేపర్
కుల నిర్మూలనే అంబేద్కర్ ఆశయం - పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ JH-95368

జనహితం న్యూస్, హైదరాబాద్: భారత రాజ్యాంగ నిర్మాత పీడత ప్రజల అభివృద్ధి కోసం జీవితాన్ని ధారబోసిన మహానీయుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా హైదరాబాద్ లోయర్ ట్యాంక్ బండ్ వద్దగల ఆ మహనీయుడి విగ్రహానికి ఎమ్మార్పీఎస్ అధినేత పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

అనంతరం మీడియాతో మందకృష్ణ మాదిగ గారు మాట్లాడుతూ అంబేద్కర్ దేశంలో పేరుకుపోయినటువంటి సామాజిక అసమానతల ను తొలగించడం కోసం కుల నిర్మూలన జరగాలని ఎన్నో పోరాటాలు చేయడం జరిగింది. కుల నిర్మూలన అనేది అంబేద్కర్ ఆశయం, అది కుల వ్యవస్థ రద్దు వల్లనే సాధ్యమవుతుందని అన్నారు.

దేశం మరింత శక్తివంతంగా మారాలంటే, దేశంలోని ప్రజలందరూ స్వేచ్ఛ, సమానత్వాన్ని, స్వాతంత్రాన్ని అనుభవించాలంటే కుల నిర్మూలన జరగాల్సిన అవసరం ఉందని, కుల వ్యవస్థ రద్దు కావాల్సిన అవసరం ఉందని అన్నారు. కుల వ్యవస్థ రద్దు అనేది పార్లమెంట్ తలుచుకుంటే ఇబ్బందికర సమస్య ఏమి కాదని అన్నారు.

ఈ దేశంలో అన్ని వర్గాల ప్రజలకు మత స్వేచ్ఛ ఉంటే కేవలం దళితులకు మాత్రమే మత స్వేచ్ఛ లేకుండా పోతుందని ఇది ఘోరమైన వివక్షత అని అన్నారు. రాజ్యాంగం దళితులకు మత స్వేచ్ఛను కల్పిస్తే 1950 రాష్ట్రపతి ఉత్తర్వులు ఆ మత స్వేచ్ఛను అడ్డుకుంటున్నాయని అన్నారు.

కావున దళితుల మత స్వేచ్ఛ మీద ఆంక్షలు విధిస్తున్న 1950 రాష్ట్రపతి ఉత్తర్వులను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఓసి, బిసి, ఎస్టీ మొదలగు సామాజిక వర్గాల వారు నచ్చిన మతాన్ని పాటిస్తే వారి సామాజిక హోదా రద్దు కానప్పుడు ఒక దళితుల సామాజిక హోదా మాత్రమే రద్దు కావడం అనేది వివక్షతకు నిదర్శనం అన్నారు. దళితుల మత స్వేచ్ఛ అనేది ఇతరుల ఆధిపత్యం మీద ఆధారపడి ఉండడం అనేదాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని అన్నారు. అన్ని వర్గాల వారికి మత స్వేచ్ఛ ఉన్నట్టుగానే దళితులకు కూడా మత స్వేచ్ఛ ఉండాలని అన్నారు.

1950 రాష్ట్రపతి ఉత్తర్వులలో సిక్కు దళితులను మినహాయింపు ఇచ్చినట్లుగానే , బౌద్ధ దళితులకు మినహాయింపులు ఇచ్చినట్లుగానే, దళిత క్రైస్తవులు కూడా మినహాయింపులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి, అంబేద్కర్ స్ఫూర్తికి నిలువెత్తు నిరసనగా నిలబడుతుందని అన్నారు. అంబేద్కర్ స్ఫూర్తితో కుల నిర్మూలన కోసం, కుల వ్యవస్థ రద్దు కోసం, సామాజిక అంతరాల తొలగింపు కోసం ఎమ్మార్పీఎస్ ఉద్యమ ప్రయాణాన్ని కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో MRPS రాష్ట్ర అధ్యక్షుడు గోవిందు నరేష్ మాదిగ, ఎమ్మెస్ ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కార్తీక్ మాదిగ, మహిళా జాతీయ నేత జేపీ లత మాదిగ, హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు టివి నరసింహా మాదిగ, రాష్ట్ర నాయకులు విఎస్ రాజు మాదిగ, అరుణ్ మాదిగ, రావు గళ్ళ బాబు మాదిగ, మానికొల్ల గంగాధర్ మాదిగ, వాట్సాప్ రవి మాదిగ తదితరులు పాల్గొన్నారు.

Click to join Whatsapp channel
Janahitham News
కుల నిర్మూలనే అంబేద్కర్ ఆశయం - పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ
కుల నిర్మూలనే అంబేద్కర్ ఆశయం - పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ

→ గోనె సాయిలు - ఎడిటర్‌ / సీనియర్ రిపోర్టర్