సైబర్ ఉచ్చులో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి
Published on 09 Apr 2026, 05:22 PM 107
JH-63560
జనహితం న్యూస్, జనగామ: టెలికాం నెట్, జాజీపేట్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి సైబర్ ఉచ్చులో పడ్డారు. ప్రస్తుతం ఉన్న తాత్కాలిక పేరుతో సైబర్ నేరగాడు ఆయనను మోసం చేసినట్లు తెలిసింది. పల్లాకు ఓ గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి తనను తాను తెలంగాణ ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్ అడిషనల్ సెక్రటరీగా పరిచయం చేసుకున్నాడు.
కేంద్ర పరిధిలో డిజిటల్ భారత్ పథకం కింద ఒక్కొక్కరికీ రూ.10 లక్షలు వరకు రుణాలు లభిస్తాయని నమ్మించాడు. 40 మంది అభ్యర్థుల జాబితా పంపాలని, దరఖాస్తుకు ఈ రోజు చివరి రోజు అని చెప్పాడు. ప్రాసెసింగ్ ఫీజు కింద రూ.2,500 చొప్పున మొత్తం 40 మందికి కలిపి రూ.లక్ష వెంటనే గూగుల్ పే చేయాలని కోరాడు.
ప్రజలకు మేలు జరుగుతుందనే ఉద్దేశంతో ఎమ్మెల్యే గందరగోళంలోనే రూ.లక్ష చెల్లించినట్లు సమాచారం. డబ్బులు పంపిన తర్వాత సదరు వ్యక్తి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో అనుమానం వచ్చి ఎమ్మెల్యే ఆ విషయాన్ని పోలీసులకు తెలియజేశారు.
పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇలాంటి మాయగాళ్ల ఉచ్చులో పడొద్దు అని తెలియజేశారు.
