ప్రమాదంలో మృతి.. కుటుంబానికి అండగా బీఆర్ఎస్ నేత కంఠారెడ్డి సహాయం
Published on 18 Apr 2026, 08:49 PM 63
JH-82269
జనహితం న్యూస్, రామయంపేట్: రామయంపేట్ పట్టణానికి చెందిన మున్సిపల్ 6'వ వార్డుకు చెందిన కొనాపురం శ్రీనివాస్ ప్రమాదవశాత్తు మృతి చెందిన విషయం స్థానిక నాయకులద్వారా తెలిసుకున్న బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, మెదక్ నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీ కంఠారెడ్డి తిరుపతి రెడ్డి స్థానిక నాయకుల ద్వారా 5000/- రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు... కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.. కార్యక్రమంలో స్థానిక నాయకుడు మద్దూరి భానుచందర్, సతీష్ సాగర్, ఊర నరేష్, శ్రీకాంత్, యాదగిరి, MD సల్మాన్, గణేష్, మార్కు భాను, వంశీ, పట్టణ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
