హోమ్ హైదరాబాద్‌ జాతీయం అంతర్జాతీయం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ క్రీడలు ఎడ్యుకేషన్ & కెరీర్‌ బిజినెస్ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ క్రైమ్‌ సంపద వ్యవసాయం సినిమా ఈ-పేపర్
ఒక్కసారే చర్చలు.. కార్మికులకు వేల రూపాయల జీతం పెంపు సాధించిన CITU JH-72362

జనహితం న్యూస్, మెదక్ రూరల్: CITU చొరవ కార్మికుల ఐక్యమత్యం ద్వారా మెరుగైన వేతన ఒప్పందం సాధ్యమైందని CITU జిల్లా కార్యదర్శి ఏ.మల్లేశం అన్నారు. మెదక్ జిల్లా చేగుంట మండలం చిన్న శివనూరు శివారులోని నియాపోలి పరిశ్రమ కార్మికుల వేతన ఒప్పందం పై డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ సంగారెడ్డి వద్ద శుక్రవారం నాడు సంతకాలు పూర్తి అయిన సందర్భంగా ఏ.మల్లేశం మాట్లాడినారు.

కార్మికుల వేతన ఒప్పందం గడువు 2026 మార్చి 31 తో పూర్తి కాగా ఏప్రిల్ నెలలో యాజమాన్యం తో ఏప్రిల్ 12 వ తేదీన వేతన ఒప్పందం పై చర్చలు జరిగినాయన్నారు. ఆ ఒప్పందం ప్రకారం కార్మికులకు నెలకు గరిష్టంగా 7080 రూపాయలు, కనిష్టంగా 6000 రూపాయల వేతనం పెంపుదల, నెలకు 30 రూపాయల సర్వీస్ వెయిటేజ్, 1982 సిరీస్ ప్రకారం వి.డి. ఏ 7 రూపాయల నుండి 8 రూపాయలకు పెంపుదల, ముగ్గురు క్యాజువల్ కార్మికులను పెర్మనెంట్ చేయడం కోసం ఒప్పందం కుదిరిందన్నారు.

జిల్లా లో చాలా పరిశ్రమల్లో నెలల తరబడి చర్చలు జరిగే సాంప్రదాయం ఉండగా CITU ఒకే దఫా చర్చలు చేసి ఒప్పందం చేయడం జిల్లాలోనే రికార్డు అన్నారు. ఇది కేవలం CITU నిజాయితీ, కార్మికుల ఐక్యమత్యం తోనే సాధ్యం అయిందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్పొరేట్ అనుకూల విధానాల వల్ల ఒక వైపు 12 గం.ల పని విధానం, ఉన్న కార్మికుల్నే కాంట్రాక్ట్ కార్మికులుగా మారుస్తుంటే ఉన్న క్యాజువల్ కార్మికులను పర్మినెంట్ చేసే చరిత్ర CITU దే అని ఏ.మల్లేశం అన్నారు. జిల్లాలో అనేక పరిశ్రమల్లో ఎప్పుడో నిర్ణయించిన కనీస వేతనాలు అమలు చేయకపోవడం, ఇ.ఎస్. ఐ, పి.ఎఫ్, బోనస్ లాంటి సౌకర్యాలు కల్పించడం లేదని ఏ.మల్లేశం అన్నారు.

కేంద్రం ప్రభుత్వం పాత చట్టాలను రద్దు చేసి లేబర్ కోడ్స్ తీసుకురావడం ద్వారా ప్రైవేట్ యాజమాన్యాలు మరింత రెచ్చి పోయి కార్మికుల శ్రమను దోచుకుంటున్నారని తీవ్రంగా దుయ్యబట్టారు. హక్కుల కోసం యూనియన్స్ ఏర్పాటు చేసుకుని పోరాడటమే అంతిమ పరిష్కారం అని అన్నారు. పోరాడే కార్మికులకు CITU పూర్తి అండగా నిలుస్తుందని అన్నారు. వేతన ఒప్పందం పై యజమ్యం తరపున పరిశ్రమ పార్టనర్ దక్షిత్ మోర్, ప్రతినిధి ఆదర్శ్, నియాపోలి ఇండస్ట్రీస్ ఎంప్లాయీస్ యూనియన్ CITU తరపున CITU జిల్లా కార్యదర్శి ఆ యూనియన్ అధ్యక్షులు ఏ.మల్లేశం ,ప్రధాన కార్యదర్శి కె.నవీన్, ఉపాధ్యక్షులు మురళి గౌడ్, సహాయ కార్యదర్శి మహేష్, కోశాధికారి శేఖర్, కార్మిక శాఖ తరపున డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ రవీందర్ రెడ్డి సంతకాలు చేశారు. ఐ.డి యాక్ట్ 12(3) ప్రకారం ఈ వేతన ఒప్పందం కాల పరిమితి 2026 ఏప్రిల్ 1 నుండి 2029 మార్చి 31 వరకు ఉంటుందన్నారు.

Click to join Whatsapp channel
Janahitham News
ఒక్కసారే చర్చలు.. కార్మికులకు వేల రూపాయల జీతం పెంపు సాధించిన CITU
ఒక్కసారే చర్చలు.. కార్మికులకు వేల రూపాయల జీతం పెంపు సాధించిన CITU

→ మల్లీశెట్టి రవి - రిపోర్టర్‌