మెదక్ గోల్కొండ వీధిలో అంబేద్కర్ జయంతి… కాంగ్రెస్ నేత ప్రవీణ్ కుమార్ సందేశం
Published on 14 Apr 2026, 09:08 PM 51
JH-57234
జనహితం న్యూస్, మెదక్ రూరల్: మెదక్ జిల్లా గోల్కొండ వీధి లో భారతదేశ రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ భీమ్రావు అంబేద్కర్ 135 వ జయంతి కార్యక్రమం స్థానిక మెదక్ పట్టణంలో గల గోల్కొండ వీధి కాలనీలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతిని ఘనంగా కాలనీ యువకులు అంబేద్కర్ జయంతిని జరుపుకున్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ 27th వాడ్ ఇంచార్జ్ గిద్దకింది ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అంటరానితనం కుల నిర్మూలన కోసం సమ సమాజ మార్పు కోసం అహర్నిశలు పోరాటం చేసిన వ్యక్తి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు అన్నారు.
చిన్నతనం నుండి ఎన్నో అవమానాలు ఎన్నో ఆటుపోటుల మధ్య జీవనం కొనసాగించిన వ్యక్తిగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు పట్టుదలతో ఎన్నో డాక్టరేట్లు ఉన్నత చధువులు చదువుకొని డాక్టరేట్ పట్టా చేపట్టారన్నారు. కేంద్ర మంత్రిగా బాధ్యత లు చేపట్టి మహిళల అభ్యున్నతి కోసం వారి హక్కుల కోసం బిల్లు పార్లమెంట్లో పెట్టిన మొదటి వ్యక్తి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని అన్నారు. ఆ బిల్లు ఆమోదం పొందలేని సమయంలో తన పదవికి సైతం రాజీనామా చేపట్టరన్నారు.
ఆ తర్వాత మళ్లీ రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన ఘనత కూడా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారికె దక్కిందన్నారు. స్వతంత్ర భారతవనికి ప్రజాస్వామ్య పునాదులపై సాంఘిక ఆర్థిక రాజకీయ స్వేచ్ఛలను ప్రతిపాదించిన మహనీయుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అన్నారు. దళిత పీడిత కులాల వికాసానికి పాటుపడిన వ్యక్తి మహనీయుడు భారత స్వాతంత్ర సమరయోధుడు భారతరత్న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ భీమ్రావు అంబేద్కర్ అని అన్నారు.
ఇట్టి జయంతి కార్యక్రమంలో కాలనీ యువకులు బోడెల్లిగారి లక్ష్మణ్, అస్తగల కుమార్, సురేష్, నాగేంద్ర, రోహిత్, చదల్, జానకి రామ్, రవి తదితరులు పాల్గొన్నారు.
