హోమ్ హైదరాబాద్‌ జాతీయం అంతర్జాతీయం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ క్రీడలు ఎడ్యుకేషన్ & కెరీర్‌ బిజినెస్ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ క్రైమ్‌ సంపద వ్యవసాయం సినిమా ఈ-పేపర్
శమ్నాపూర్‌లో అంబేద్కర్ జయంతి ఘనంగా… మలిశెట్టి రవి సందేశం JH-16347

జనహితం న్యూస్, మెదక్ రూరల్: మెదక్ జిల్లా హవేలీ ఘణపూర్ శమ్నాపూర్ గ్రామంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతిని ఘనంగా కాలనీ యువకులు అంబేద్కర్ జయంతిని జరుపుకున్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా ఎమ్మార్పీఎస్ మెదక్ జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లిశెట్టి రవి మాదిగ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అంటరానితనం కుల నిర్మూలన కోసం సమ సమాజ మార్పు కోసం అహర్నిశలు పోరాటం చేసిన వ్యక్తి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని అన్నారు. చిన్నతనం నుండి ఎన్నో అవమానాలు ఎన్నో ఆటుపోటుల మధ్య జీవనం కొనసాగించిన వ్యక్తిగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పట్టుదలతో ఎన్నో డాక్టరేట్లు ఉన్నత చధువులు చదువుకొని డాక్టరేట్ పట్టా చేపట్టారన్నారు.

కేంద్ర మంత్రిగా బాధ్యత లు చేపట్టి మహిళల అభ్యున్నతి కోసం వారి హక్కుల కోసం బిల్లు పార్లమెంట్లో పెట్టిన మొదటి వ్యక్తి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని అన్నారు. ఆ బిల్లు ఆమోదం పొందలేని సమయంలో తన పదవికి సైతం రాజీనామా చేపట్టరన్నారు. ఆ తర్వాత మళ్లీ రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన ఘనత కూడా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారికె దక్కిందన్నారు స్వతంత్ర భారతవనికి ప్రజాస్వామ్య పునాదులపై సాంఘిక ఆర్థిక రాజకీయ స్వేచ్ఛలను ప్రతిపాదించిన మహనీయుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అన్నారు.

దళిత పీడిత కులాల వికాసానికి పాటుపడిన వ్యక్తి మహనీయుడు భారత స్వాతంత్ర సమరయోధుడు భారతరత్న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ భీమ్రావు అంబేద్కర్ అని అన్నారు.

ఇట్టి జయంతి కార్యక్రమంలో శమ్నాపూర్ గ్రామ సర్పంచ్ పట్నం నాగరాణి, ఉప సర్పంచ్ అనిల్, పంచాయతీ కార్యదర్శి డాక్టర్ యాదగిరి, వార్డ్ మెంబర్ లు చాకలి అశోక్ బాలరాజ్, ఎన్ వినయ్ కుమార్, అంబేద్కర్ సంఘం యువకులు బాలరాజ్, నందు రాజు, భాను, రాహుల్, పి రాజు, ఎం శ్రీకాంత్, చరణ్, జె శ్రీకాంత్, అంగన్వాడి టీచర్లు సిద్ధలక్ష్మి, కవిత, ఆశా వర్కర్ మరియు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Click to join Whatsapp channel
Janahitham News
శమ్నాపూర్‌లో అంబేద్కర్ జయంతి ఘనంగా… మలిశెట్టి రవి సందేశం
శమ్నాపూర్‌లో అంబేద్కర్ జయంతి ఘనంగా… మలిశెట్టి రవి సందేశం

→ మల్లీశెట్టి రవి - రిపోర్టర్‌